చాలునె చాలునె సట లిఁకనూ ని
(॥పల్లవి॥)
చాలునె చాలునె సట లిఁకనూ ని-
న్నేలిన పతికడ కేఁగగరాదా
(॥చాలు॥)
పెంచినఁ బెరుగును పెనునీచలములు
నించిన కొప్పునెరులవలె
వంచిన వాలును వడి నీకోపము
చుంచులనీకనుచూపులవలెను
(॥చాలు॥)
కరఁచినఁ గరఁగును కలికి నీమనసు
పరుగునీకాంతులపసిఁడివలె
మరపిన మరగును మహి నీగుణములు
పెరతేనేలనీపెదవులవలెను
(॥చాలు॥)
కదిసిన గద్దా కాంక్ష నీరతులు
ముదిరిన నీకుచములవలెను
యెదురనె శ్రీవేంకటేశుఁడు గూడెను
పదవులజవ్వనసాయమువలెను
(||pallavi||)
sālunĕ sālunĕ saḍa lim̐kanū ni-
nnelina padigaḍa kem̐gagarādā
(||sālu||)
pĕṁchinam̐ bĕrugunu pĕnunīsalamulu
niṁchina kŏppunĕrulavalĕ
vaṁchina vālunu vaḍi nīgobamu
suṁchulanīganusūbulavalĕnu
(||sālu||)
karam̐sinam̐ garam̐gunu kaligi nīmanasu
parugunīgāṁtulabasim̐ḍivalĕ
marabina maragunu mahi nīguṇamulu
pĕradenelanībĕdavulavalĕnu
(||sālu||)
kadisina gaddā kāṁkṣha nīradulu
mudirina nīgusamulavalĕnu
yĕduranĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnu
padavulajavvanasāyamuvalĕnu