Saalunayya veyidibai javvaadigommu

చాలునయ్య వేయిటిపై జవ్వాదికొమ్ము
Language

(॥పల్లవి॥)
చాలునయ్య వేయిటిపై జవ్వాదికొమ్ము
యేలిన నీపై నుండనియ్యవయ్యా మాఁట

(॥చాలు॥)
కూరిమి చూపి నిన్నుఁ గొసరఁగఁ గొసరఁగ
యేరీతి నుండునో చిత్త మేవేళను
బీరపువారము నేము బిరుదువాఁడవు నీవు
తారుకాణించఁగఁబోతే దైలువారుఁ గోపము

(॥చాలు॥)
ప్రేమతోడుత నిన్నుఁ బిలువఁగఁ బిలువఁగ
యేమని వేసరుదువో యేవేళను
నేమపువారము నేము నీయిచ్చవాఁడవు నీవు
చేముట్టి పెనఁగఁబోతే చిమ్మిరేఁగుఁ జలము

(॥చాలు॥)
తతిగొని నిన్ను రతిఁ దగులఁగఁ దగులఁగ
యితవై వుండునో కాదో యేవేళను
సతి నేను శ్రీవేంకటపతివి నాకు నీవు
సతమై యిట్టె కూడితే చక్కనౌను పనులు

(||pallavi||)
sālunayya veyiḍibai javvādigŏmmu
yelina nībai nuṁḍaniyyavayyā mām̐ṭa

(||sālu||)
kūrimi sūbi ninnum̐ gŏsaram̐gam̐ gŏsaram̐ga
yerīdi nuṁḍuno sitta meveḽanu
bīrabuvāramu nemu biruduvām̐ḍavu nīvu
tārugāṇiṁcham̐gam̐bode dailuvārum̐ gobamu

(||sālu||)
premadoḍuda ninnum̐ biluvam̐gam̐ biluvam̐ga
yemani vesaruduvo yeveḽanu
nemabuvāramu nemu nīyichchavām̐ḍavu nīvu
semuṭṭi pĕnam̐gam̐bode simmirem̐gum̐ jalamu

(||sālu||)
tadigŏni ninnu radim̐ dagulam̐gam̐ dagulam̐ga
yidavai vuṁḍuno kādo yeveḽanu
sadi nenu śhrīveṁkaḍabadivi nāgu nīvu
sadamai yiṭṭĕ kūḍide sakkanaunu panulu