Saalunamma yimkanemi samgadigaadu

చాలునమ్మ యిఁకనేమి సంగతిగాదు
Language

(॥పల్లవి॥)
చాలునమ్మ యిఁకనేమి సంగతిగాదు
యేలినవాఁ డిదె వచ్చి యింటనున్న మీఁదను

(॥చాలు॥)
పంతపు నీమాటలకు పనిలేదు ఆతనితో
చింతదీర కడువలచినమీఁద
కొంత గొంత కన్నులనే కోపగించఁ బనిలేదు
ఇంతేసిచనవు నీ విచ్చినందుమీఁదను

(॥చాలు॥)
కన్నులఁ దప్పక చూచి కాఁతాళించఁ బనిలేదు
అన్నిటా నాతనికి లోనైన మీఁద
సన్నల జంకిం చాతని సాదించఁ బనిలేదు
యిన్నేసినోములు నోమి ఇయ్యకొన్నమీఁదను

(॥చాలు॥)
వుడుకునిట్టూరుపులు నుస్సురనఁ బనిలేదు
బడి బడి నాతనితోఁ బై కొన్నిమీఁద
యెడయక శ్రీవేంకటేశుఁ డితఁడే కూడె
జడియఁగఁ బనిలేదు సతమైనమీఁదను

(||pallavi||)
sālunamma yim̐kanemi saṁgadigādu
yelinavām̐ ḍidĕ vachchi yiṁṭanunna mīm̐danu

(||sālu||)
paṁtabu nīmāḍalagu paniledu ādanido
siṁtadīra kaḍuvalasinamīm̐da
kŏṁta gŏṁta kannulane kobagiṁcham̐ baniledu
iṁtesisanavu nī vichchinaṁdumīm̐danu

(||sālu||)
kannulam̐ dappaga sūsi kām̐tāḽiṁcham̐ baniledu
anniḍā nādanigi lonaina mīm̐da
sannala jaṁkiṁ sādani sādiṁcham̐ baniledu
yinnesinomulu nomi iyyagŏnnamīm̐danu

(||sālu||)
vuḍuguniṭṭūrubulu nussuranam̐ baniledu
baḍi baḍi nādanidom̐ bai kŏnnimīm̐da
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe kūḍĕ
jaḍiyam̐gam̐ baniledu sadamainamīm̐danu