Saalumjaalu romtaloo sadalaayam banuloo

చాలుఁజాలు రోఁతలూ సటలాయఁ బనులూ
Language

(॥పల్లవి॥)
చాలుఁజాలు రోఁతలూ సటలాయఁ బనులూ
తాలిమిలేనిదానను తడవకువయ్యా

(॥చాలుఁ॥)
మాటలాడితివొ లేదో మగువతో నేఁ జూడఁగ
మాట లిఁక నాకు నీతో మఱి యాల
తేటగా నవ్వితొ లేదొ తేరకొని ఆకేతోనే
యీటుకు నీతో నవ్వ నిఁకనేలయ్యా

(॥చాలుఁ॥)
తప్పక చూచితొ లేదో తరుణిమొగ మప్పుడు
యిప్పుడు నే నిది చూడ ఇత వవునా
వొప్పి దగ్గరితొ లేదొ వున్నచో ఆకెను నీవు
యిప్పుడు నిన్ను దగ్గర నింపవునటయ్యా

(॥చాలుఁ॥)
కాఁగిలించితివొ లేదొ కాంత నల్లనాఁడు నీవు
కాఁగిలించితి నేఁడు కమ్మటినిన్ను
వీఁగక శ్రీవేంకటేశ వేమారు సాదించనోప
మాఁగినరతులఁ బెనుమాయ లింకేలా

(||pallavi||)
sālum̐jālu rom̐talū saḍalāyam̐ banulū
tālimilenidānanu taḍavaguvayyā

(||sālum̐||)
māḍalāḍidivŏ ledo maguvado nem̐ jūḍam̐ga
māḍa lim̐ka nāgu nīdo maṟi yāla
teḍagā navvidŏ ledŏ teragŏni āgedone
yīḍugu nīdo navva nim̐kanelayyā

(||sālum̐||)
tappaga sūsidŏ ledo taruṇimŏga mappuḍu
yippuḍu ne nidi sūḍa ida vavunā
vŏppi daggaridŏ ledŏ vunnaso āgĕnu nīvu
yippuḍu ninnu daggara niṁpavunaḍayyā

(||sālum̐||)
kām̐giliṁchidivŏ ledŏ kāṁta nallanām̐ḍu nīvu
kām̐giliṁchidi nem̐ḍu kammaḍininnu
vīm̐gaga śhrīveṁkaḍeśha vemāru sādiṁchanoba
mām̐ginaradulam̐ bĕnumāya liṁkelā