Saalumjaalu ninnimta jarayanela

చాలుఁజాలు నిన్నింత జరయనేల
Language

(॥పల్లవి॥)
చాలుఁజాలు నిన్నింత జరయనేల
నీ లాగులెల్లఁ గంటిమి నీవు నీవేకావా

(॥చాలు॥)
వంకదిద్ద వసమా వాఁటపుయేరులకెల్ల
అంకెల నీగుణములు అట్టివెకావా
లంకెఁబెట్టవశమా లావున మేఘములను
ఇంకనేల నీమనసు ఇట్టిదేకాదా

(॥చాలు॥)
కట్టిపెట్టవశమా గాలి ముడియగాఁగ
వొట్టిననీమోహమును నట్టిదేకాదా
కట్టుకొనవశమా కానరానిపట్టుచీర
వట్టినీవినయములు వలసినవేకావా

(॥చాలు॥)
లెక్క పెట్టవశమా లీలతోడఁ జుక్కలెల్ల
యిక్కడ నారతు లిట్టివేకావా
గక్కున శ్రీవేంకటేశ కలసితి విట్టె నన్ను
చక్కనిసరస మిఁక సమ్మతేకాదా

(||pallavi||)
sālum̐jālu ninniṁta jarayanela
nī lāgulĕllam̐ gaṁṭimi nīvu nīvegāvā

(||sālu||)
vaṁkadidda vasamā vām̐ṭabuyerulagĕlla
aṁkĕla nīguṇamulu aṭṭivĕgāvā
laṁkĕm̐bĕṭṭavaśhamā lāvuna meghamulanu
iṁkanela nīmanasu iṭṭidegādā

(||sālu||)
kaṭṭibĕṭṭavaśhamā gāli muḍiyagām̐ga
vŏṭṭinanīmohamunu naṭṭidegādā
kaṭṭugŏnavaśhamā kānarānibaṭṭusīra
vaṭṭinīvinayamulu valasinavegāvā

(||sālu||)
lĕkka pĕṭṭavaśhamā līladoḍam̐ jukkalĕlla
yikkaḍa nāradu liṭṭivegāvā
gakkuna śhrīveṁkaḍeśha kalasidi viṭṭĕ nannu
sakkanisarasa mim̐ka sammadegādā