Saalumjaalu nimkanela jaalimbettevu

చాలుఁజాలు నిఁకనేల జాలిఁబెట్టేవు
Language

(॥పల్లవి॥)
చాలుఁజాలు నిఁకనేల జాలిఁబెట్టేవు
యేలాటాలు యేనుగతో నింత నేరఁగలమా

(॥చాలు॥)
తగవులే నడపేవు తరుకాణకే వచ్చేవు
జగడము సాదించితే సారె నవ్వేవు
మొగము చూచితేను ముంచి యానలు వెట్టేవు
యెగసక్కీఁడవు నీతో నింత నేరఁగలమా

(॥చాలు॥)
తేరకొనఁ జూచేవు తేనె లుట్టిపడించేవు
తారుచుఁ దిట్టితే జాణతనాలాడేవు
మారుమోమై వుండితేను మరియు వేఁడుకొనేవు
యీరీతివాఁవు నీతో నిఁత నేరఁగలమా

(॥చాలు॥)
కందువలే చూపేవు కాఁగిటనె కూడేవు
అంది వెంగెమాడితేను అట్టె మెచ్చేవు
ఇందరిలో శ్రీవేంకటేశుఁడ నన్నేలతివి
యిందలివాఁడవు నీతో నింత నేరఁగలమా

(||pallavi||)
sālum̐jālu nim̐kanela jālim̐bĕṭṭevu
yelāḍālu yenugado niṁta neram̐galamā

(||sālu||)
tagavule naḍabevu tarugāṇage vachchevu
jagaḍamu sādiṁchide sārĕ navvevu
mŏgamu sūsidenu muṁchi yānalu vĕṭṭevu
yĕgasakkīm̐ḍavu nīdo niṁta neram̐galamā

(||sālu||)
teragŏnam̐ jūsevu tenĕ luṭṭibaḍiṁchevu
tārusum̐ diṭṭide jāṇadanālāḍevu
mārumomai vuṁḍidenu mariyu vem̐ḍugŏnevu
yīrīdivām̐vu nīdo nim̐ta neram̐galamā

(||sālu||)
kaṁduvale sūbevu kām̐giḍanĕ kūḍevu
aṁdi vĕṁgĕmāḍidenu aṭṭĕ mĕchchevu
iṁdarilo śhrīveṁkaḍeśhum̐ḍa nanneladivi
yiṁdalivām̐ḍavu nīdo niṁta neram̐galamā