చాలుఁజాలు ననరె సాదించ మమ్మింతయేల
(॥పల్లవి॥)
చాలుఁజాలు ననరె సాదించ మమ్మింతయేల
యీలకూర కుప్పు చాల దిందేమి గలదే
(॥చాలు॥)
గొప్పలు మాకన్నులు కొంచము మానెమ్మొగము
తపపులెన్నైనాఁ గలవు తడవనేలే
చిప్పిలీ నాకిదె నవ్వు చిందీ నామోవిఁ దేనె
యెప్పుడు వచ్చినాఁ దన కిందేమి గలదే
(॥చాలు॥)
పిడికెఁడు మానడుము పెచ్చువెరిగేచన్నులు
వెడ మామేనివొచ్చాలు వెదకనేలే
వుడికీ నామనసైతే వూరికె యదరీ మేను
యెడయక తాఁ బిలిచీ నిందేమి గలదే
(॥చాలు॥)
కంచువంటిది కుత్తిక కపురాలు పలుకులు
యెంచి మామాటలు సోదించఁగనేలే
అంచెల శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె
యెంచియెంచి పొగడీని యిందేమి గలదె
(||pallavi||)
sālum̐jālu nanarĕ sādiṁcha mammiṁtayela
yīlagūra kuppu sāla diṁdemi galade
(||sālu||)
gŏppalu māgannulu kŏṁchamu mānĕmmŏgamu
tababulĕnnainām̐ galavu taḍavanele
sippilī nāgidĕ navvu siṁdī nāmovim̐ denĕ
yĕppuḍu vachchinām̐ dana kiṁdemi galade
(||sālu||)
piḍigĕm̐ḍu mānaḍumu pĕchchuvĕrigesannulu
vĕḍa māmenivŏchchālu vĕdaganele
vuḍigī nāmanasaide vūrigĕ yadarī menu
yĕḍayaga tām̐ bilisī niṁdemi galade
(||sālu||)
kaṁchuvaṁṭidi kuttiga kaburālu palugulu
yĕṁchi māmāḍalu sodiṁcham̐ganele
aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ
yĕṁchiyĕṁchi pŏgaḍīni yiṁdemi galadĕ