చాలుఁబో యీ పొందే చవులు నీకును
(॥పల్లవి॥)
చాలుఁబో యీ పొందే చవులు నీకును
ఆలించి యేమి సేసినా ఆయము సోఁకీని
(॥చాలు॥)
అచ్చపు గుట్టున నుండవయ్య నీవు । నీతో
హెచ్చి నిజమాడరాదు యీకాలము
ఇచ్చకము లాడువారే ఇతవు నీకు । నిన్నుఁ
బచ్చిగా నేమన్నాను పసురువేసీని
(॥చాలు॥)
అంటిముట్టి సరసా లేలయ్యా నీవు
యింటిచెట్టు మందు గాదు యీకాలము
వెంటఁదిరుగాడువారే వేడుక నీకు । నిన్ను
దంటనై నేనేమన్నాఁదగవు దప్పీని
(॥చాలు॥)
అలయించేవు రతి నేలయ్యా నీవు
యెలమిఁ గాఁగిలే చాలు నీ కాలము
బలిమి శ్రీవేంకటేశ పట్టి గూడితిని నన్ను
తొలఁగి నిన్నేమన్నాను దోసము వచ్చీని
(||pallavi||)
sālum̐bo yī pŏṁde savulu nīgunu
āliṁchi yemi sesinā āyamu som̐kīni
(||sālu||)
achchabu guṭṭuna nuṁḍavayya nīvu | nīdo
hĕchchi nijamāḍarādu yīgālamu
ichchagamu lāḍuvāre idavu nīgu | ninnum̐
bachchigā nemannānu pasuruvesīni
(||sālu||)
aṁṭimuṭṭi sarasā lelayyā nīvu
yiṁṭisĕṭṭu maṁdu gādu yīgālamu
vĕṁṭam̐dirugāḍuvāre veḍuga nīgu | ninnu
daṁṭanai nenemannām̐dagavu dappīni
(||sālu||)
alayiṁchevu radi nelayyā nīvu
yĕlamim̐ gām̐gile sālu nī kālamu
balimi śhrīveṁkaḍeśha paṭṭi gūḍidini nannu
tŏlam̐gi ninnemannānu dosamu vachchīni