చాలుఁ జాలుఁ దనిసితి సటలనె నేఁ డెల్ల
(॥పల్లవి॥)
చాలుఁ జాలుఁ దనిసితి సటలనె నేఁ డెల్ల
తాలిమి నిందుకె నిన్నుఁ దప్పక చూచేను
(॥చాలు॥)
నేయ రానిచేఁత లెల్లఁ జేసి వచ్చి నీవు నన్ను
పాయిని చుట్టమువలెఁ బై కొనేవు
కాయకపువారికె కాని లే వీ వినయాలు
వొయమ్మ నిన్నే మనే నూరకుండేఁ గాక
(॥చాలు॥)
చిత్త మెక్కడనో పెట్టి చేరి నాతో మాయలకు
బిత్త గలవానివెల పలికే విదే
హత్తి గాయగంట్లె కాని అంతేసి నేరరు
యిత్తల నెట్టు పూఁకొందు నిట్టె నవ్వేఁ గాక
(॥చాలు॥)
తేరకల్లె నెవ్వతెనో తెచ్చి యాపెచేత నాకు
చేరికొనఁ బెట్టి సేవ సేయించేవు
నేరుపు శ్రీవెంకటేశ నీకె కాని లేదు
సారెనన్నుఁ గూడితివి సమ్మతాయ నిదివో
(||pallavi||)
sālum̐ jālum̐ danisidi saḍalanĕ nem̐ ḍĕlla
tālimi niṁdugĕ ninnum̐ dappaga sūsenu
(||sālu||)
neya rānisem̐ta lĕllam̐ jesi vachchi nīvu nannu
pāyini suṭṭamuvalĕm̐ bai kŏnevu
kāyagabuvārigĕ kāni le vī vinayālu
vŏyamma ninne mane nūraguṁḍem̐ gāga
(||sālu||)
sitta mĕkkaḍano pĕṭṭi seri nādo māyalagu
bitta galavānivĕla palige vide
hatti gāyagaṁṭlĕ kāni aṁtesi neraru
yittala nĕṭṭu pūm̐kŏṁdu niṭṭĕ navvem̐ gāga
(||sālu||)
teragallĕ nĕvvadĕno tĕchchi yābĕseda nāgu
serigŏnam̐ bĕṭṭi seva seyiṁchevu
nerubu śhrīvĕṁkaḍeśha nīgĕ kāni ledu
sārĕnannum̐ gūḍidivi sammadāya nidivo