Saalum jaalu vaamduleni janmamelaa

చాలుఁ జాలు వాఁడులేని జన్మమేలా
Language

(॥పల్లవి॥)
చాలుఁ జాలు వాఁడులేని జన్మమేలా
జాలి నన్నుఁ బెట్టకురె సారె సారెఁ జెలులు

(॥చాలు॥)
నేఁడు వానిఁబాసిన వెన్నెలబయలేలా
వోడక వాఁడుగాఁగిటనుండనినిద్రేలా
కూడి వాఁడు నేను గప్పుకోనిపయ్యెదేలా
వీడని చెక్కుతోడివెరగే చాలును

(॥చాలు॥)
లీల వానిసరసములేనినవ్వేలా
ఆలించి వాడువినని ఆమాటలేలా
సోలి నిద్దరు నొక్కటై చూడనియద్దమేలా
తాలిమితో లోలోనె తలపోఁతే చాలును

(॥చాలు॥)
యీకడ వాఁడుగూడ నియీజవ్వనమేలా
ఆకు వాఁడు మడచియియ్యనితమ్ములమేలా
వాఁకగా శ్రీవేంకటాద్రి వాఁడు నన్నుఁ గూడె నిదె
మాఁకు పడఁజొక్కినయీమర పిదె చాలును

(||pallavi||)
sālum̐ jālu vām̐ḍuleni janmamelā
jāli nannum̐ bĕṭṭagurĕ sārĕ sārĕm̐ jĕlulu

(||sālu||)
nem̐ḍu vānim̐bāsina vĕnnĕlabayalelā
voḍaga vām̐ḍugām̐giḍanuṁḍaninidrelā
kūḍi vām̐ḍu nenu gappugonibayyĕdelā
vīḍani sĕkkudoḍivĕrage sālunu

(||sālu||)
līla vānisarasamuleninavvelā
āliṁchi vāḍuvinani āmāḍalelā
soli niddaru nŏkkaḍai sūḍaniyaddamelā
tālimido lolonĕ talabom̐te sālunu

(||sālu||)
yīgaḍa vām̐ḍugūḍa niyījavvanamelā
āgu vām̐ḍu maḍasiyiyyanidammulamelā
vām̐kagā śhrīveṁkaḍādri vām̐ḍu nannum̐ gūḍĕ nidĕ
mām̐ku paḍam̐jŏkkinayīmara pidĕ sālunu