చాలుఁ జాలు నున్నదెల్లాఁ జాలదా యిది
(॥పల్లవి॥)
చాలుఁ జాలు నున్నదెల్లాఁ జాలదా యిది
జాలెల్లా నిందునే పాసెఁ జాలదా యిది
(॥చాలు॥)
పరగ నే నవ్వితేఁ గోపగించుకొనకా యిట్టే
సరిగా నీవు నవ్వితి చాలదా యిది
ధరనేఁ గొంగువట్టితేఁ దప్పించుకొనకా
సరవి నూరకుండితి చాలదా యిది
(॥చాలు॥)
కన్నులనేఁ బిలిచితే కమ్మర జంకించకా
సన్నలకే వచ్చితివి చాలదా యిది
నిన్నుఁ దప్పక చూచితే నిలిచి వాదుకు రాక
జన్నెవలపు చల్లితి చాలదా యిది
(॥చాలు॥)
తమితో నిన్నుఁ గూడఁగ దప్పులఁ బొరలకా
సమరతిఁ జొక్కితివి చాలదా యిది
అమరె శ్రీవేంకటేశ యనుమాన మెంచకా
జమళిఁ గూచుంటి విట్టె చాలదా యిది
(||pallavi||)
sālum̐ jālu nunnadĕllām̐ jāladā yidi
jālĕllā niṁdune pāsĕm̐ jāladā yidi
(||sālu||)
paraga ne navvidem̐ gobagiṁchugŏnagā yiṭṭe
sarigā nīvu navvidi sāladā yidi
dharanem̐ gŏṁguvaṭṭidem̐ dappiṁchugŏnagā
saravi nūraguṁḍidi sāladā yidi
(||sālu||)
kannulanem̐ biliside kammara jaṁkiṁchagā
sannalage vachchidivi sāladā yidi
ninnum̐ dappaga sūside nilisi vādugu rāga
jannĕvalabu sallidi sāladā yidi
(||sālu||)
tamido ninnum̐ gūḍam̐ga dappulam̐ bŏralagā
samaradim̐ jŏkkidivi sāladā yidi
amarĕ śhrīveṁkaḍeśha yanumāna mĕṁchagā
jamaḽim̐ gūsuṁṭi viṭṭĕ sāladā yidi