Saalum jaalu nooragumdu sadulellaa navveru

చాలుఁ జాలు నూరకుండు సతులెల్లా నవ్వేరు
Language

(॥పల్లవి॥)
చాలుఁ జాలు నూరకుండు సతులెల్లా నవ్వేరు
కేలు చాఁచి తిట్టేటి పేలరీఁడు గలఁడా

(॥చాలు॥)
యెగసక్కేలకుఁ జెలు లేమైనా నాడుదురు
పగటునబీరములు పచరింతురు
పొగరున, నీ వందుకు బుజ్జగించవలెఁగాక
మగువతోఁ గోపగించేమగవాఁడు గలఁడా

(॥చాలు॥)
కామించి రమణులు కడుసేఁతలు సేతురు
ప్రేమమున పంతములు బెరయింతురు
వేమరు నిట్లఇతే వేఁడుకొనవలెఁగాక
రామలతోనలిగేటి రమణుఁడు గలఁడా

(॥చాలు॥)
అలవోకగానెలఁత లన్నిటాను నవ్వుదురు
బలిమి శ్రీవేంకటేశపై కొందురు
కలిసితి విటువలెఁగరుణించవలెఁగాక
చెలులతో నెగ్గులెంచేచెలువుడుగలఁడా

(||pallavi||)
sālum̐ jālu nūraguṁḍu sadulĕllā navveru
kelu sām̐si tiṭṭeḍi pelarīm̐ḍu galam̐ḍā

(||sālu||)
yĕgasakkelagum̐ jĕlu lemainā nāḍuduru
pagaḍunabīramulu pasariṁturu
pŏgaruna, nī vaṁdugu bujjagiṁchavalĕm̐gāga
maguvadom̐ gobagiṁchemagavām̐ḍu galam̐ḍā

(||sālu||)
kāmiṁchi ramaṇulu kaḍusem̐talu seduru
premamuna paṁtamulu bĕrayiṁturu
vemaru niṭla̮ide vem̐ḍugŏnavalĕm̐gāga
rāmaladonaligeḍi ramaṇum̐ḍu galam̐ḍā

(||sālu||)
alavogagānĕlam̐ta lanniḍānu navvuduru
balimi śhrīveṁkaḍeśhabai kŏṁduru
kalisidi viḍuvalĕm̐garuṇiṁchavalĕm̐gāga
sĕlulado nĕggulĕṁchesĕluvuḍugalam̐ḍā