చాలుఁ జాలు నిఁకను నీ సట లేఁటికే
(॥పల్లవి॥)
చాలుఁ జాలు నిఁకను నీ సట లేఁటికే
యీలీల నే మొక్కితేను యెగసక్కె మనవా
(॥॥)
ఆవలిమోమై మాటలాడ నంటా నలిగేవు
చవిగాని మాట లాడ సంగతా నాకు
తవిలి నీమోహ మొక్కతరుణీపై నుండ గాను
వివరించి న మోహము వేడుక పుట్టీనా
(॥॥)
రంతుల నే నీయింటికి రానంటాఁ గొసరేవు
వింత వారింటికి రాగా వేడు కయ్యీనా
కాంత వేరొకతె నీకు కనుసన్న సేయఁ గాను
దొంతుల మా చూపులు తొడుసులై యుండవా
(॥॥)
అట్టే నీతో నప్ప నైతి నంటా సిగ్గు వట్టేవు
వట్టి నవ్వు నవ్వఁ బోతే వడిఁబడదా
గుట్టున శ్రీ వేంకటేశ కూడితివే నన్ను నిట్టె
దిట్టతనపు మా రతి తెల్లవార కుండీనా.
(||pallavi||)
sālum̐ jālu nim̐kanu nī saḍa lem̐ṭige
yīlīla ne mŏkkidenu yĕgasakkĕ manavā
(||||)
āvalimomai māḍalāḍa naṁṭā naligevu
savigāni māḍa lāḍa saṁgadā nāgu
tavili nīmoha mŏkkadaruṇībai nuṁḍa gānu
vivariṁchi na mohamu veḍuga puṭṭīnā
(||||)
raṁtula ne nīyiṁṭigi rānaṁṭām̐ gŏsarevu
viṁta vāriṁṭigi rāgā veḍu kayyīnā
kāṁta verŏgadĕ nīgu kanusanna seyam̐ gānu
dŏṁtula mā sūbulu tŏḍusulai yuṁḍavā
(||||)
aṭṭe nīdo nappa naidi naṁṭā siggu vaṭṭevu
vaṭṭi navvu navvam̐ bode vaḍim̐baḍadā
guṭṭuna śhrī veṁkaḍeśha kūḍidive nannu niṭṭĕ
diṭṭadanabu mā radi tĕllavāra kuṁḍīnā.