చాలుఁ జాలు నీవేల సాదించేవే
(॥పల్లవి॥)
చాలుఁ జాలు నీవేల సాదించేవే
నీ లాగు లన్నియును నే నెఱఁగనటవే
(॥చాలు॥)
చెంతల నాతఁడు నాకుఁ జెప్పినట్టు సేయఁగాను
పంతము లేలాడేవే పనిలేదు
కాంతలెదుట ముద్దుటుంగరము నాకిచ్చినాఁడు
వంతుకు నాతో బెనఁగవచ్చునటవే
(॥చాలు॥)
పనివడి యీతఁడు నాపరపు పై నుండఁగాను
చనవున నేలంటేవే చవిగాదు
చెనకి నా చన్నులపై చేతులు వేసుకున్నాఁడు
గునిసి నన్నీడువెట్టుకొనవచ్చునటవే
(॥చాలు॥)
శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ జేరి కూడివుండఁగాను
చేవమీర నేమిటికి చెప్పుకోరాదు
భావించి నన్ను రతులఁ బట్టము గట్టినవాఁడు
సేవించితి నిఁక వింత సేయవచ్చునటవే
(||pallavi||)
sālum̐ jālu nīvela sādiṁcheve
nī lāgu lanniyunu ne nĕṟam̐ganaḍave
(||sālu||)
sĕṁtala nādam̐ḍu nāgum̐ jĕppinaṭṭu seyam̐gānu
paṁtamu lelāḍeve paniledu
kāṁtalĕduḍa mudduḍuṁgaramu nāgichchinām̐ḍu
vaṁtugu nādo bĕnam̐gavachchunaḍave
(||sālu||)
panivaḍi yīdam̐ḍu nābarabu pai nuṁḍam̐gānu
sanavuna nelaṁṭeve savigādu
sĕnagi nā sannulabai sedulu vesugunnām̐ḍu
gunisi nannīḍuvĕṭṭugŏnavachchunaḍave
(||sālu||)
śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐ jeri kūḍivuṁḍam̐gānu
sevamīra nemiḍigi sĕppugorādu
bhāviṁchi nannu radulam̐ baṭṭamu gaṭṭinavām̐ḍu
seviṁchidi nim̐ka viṁta seyavachchunaḍave