Saalum jaalu namta maado satyaa lela

చాలుఁ జాలు నంత మాతో సత్యా లేల
Language

(॥పల్లవి॥)
చాలుఁ జాలు నంత మాతో సత్యా లేల
పోలించి వింటేఁ గల్లలు పుట్టెఁడేసి రాలవా

(॥చాలు॥)
యెగ్గు పట్టే వని నిన్ను యేమి యనఁ జాలఁ గాక
సిగ్గుపడే వని నీపైఁ జే చాఁచఁ గాక
నిగ్గుల నీతోఁ గనక నే నేపాటి నవ్వినాను
బగ్గన నీయచారాలు బయిటనే పడవా

(॥చాలు॥)
తల వంచే వని నిన్నుఁ దారుకాణఁ బెట్టఁ గాక
కలఁగే వని పయ్యెదఁ గప్పితిఁ గాక
వొలిసి నేఁ గనక నిన్నొత్తి మాట లాడితేను
యెలమి నీదొరతన మిట్టే యేరుపడదా

(॥చాలు॥)
పై పైఁ దమకించే వని పచ్చి సేయఁ జాలఁ గాక
కోపగించే వని నిన్నుఁ గూడితిఁ గాక
యేపున శ్రీవెంకటేశ యిట్టె నిన్ను నొరసితే
తీపులనీమోవి తప్పు దీరుచుకోఁ బడదా

(||pallavi||)
sālum̐ jālu naṁta mādo satyā lela
poliṁchi viṁṭem̐ gallalu puṭṭĕm̐ḍesi rālavā

(||sālu||)
yĕggu paṭṭe vani ninnu yemi yanam̐ jālam̐ gāga
siggubaḍe vani nībaim̐ je sām̐sam̐ gāga
niggula nīdom̐ ganaga ne nebāḍi navvinānu
baggana nīyasārālu bayiḍane paḍavā

(||sālu||)
tala vaṁche vani ninnum̐ dārugāṇam̐ bĕṭṭam̐ gāga
kalam̐ge vani payyĕdam̐ gappidim̐ gāga
vŏlisi nem̐ ganaga ninnŏtti māḍa lāḍidenu
yĕlami nīdŏradana miṭṭe yerubaḍadā

(||sālu||)
pai paim̐ damagiṁche vani pachchi seyam̐ jālam̐ gāga
kobagiṁche vani ninnum̐ gūḍidim̐ gāga
yebuna śhrīvĕṁkaḍeśha yiṭṭĕ ninnu nŏraside
tībulanīmovi tappu dīrusugom̐ baḍadā