చాలుఁ జాలు నాతోడి చల మేఁటికి
(॥పల్లవి॥)
చాలుఁ జాలు నాతోడి చల మేఁటికి
ఆలరివై వుడికించి ఆదరించ నేఁటికి
(॥చాలు॥)
జల్లజంపు గాఁకతోడ జాగులు సేయ నోప
అలాడ నేకాంత విరహమే చాలు
పెల్లున నప్పటి నన్నుఁ బిలవకురా నీవు
యిల్లిందాఁకా కాఁకఁ బెట్టి యిఁక నేల ప్రియము
(॥చాలు॥)
పలు మంచిమాటలనె భ్రమఁబడ నోప నాకు
అలర నీతో వావాద మయినా మేలు
తల యెత్తి మోము చూపి తగులకురా నన్ను
వొలసీ నొల్లక వుండి వూరడించ నేఁటికి
(॥చాలు॥)
బేసబెల్లి కాఁగిటిబిగువుకు నే నోప
రేసులతో నవ్వు నవ్వే వాసులే మెచ్చు
ఆస యిచ్చి శ్రీవెంకటాధిప నన్నుఁ గూడితి
వేసటగా నలయించి వేఁడుకొన నేఁటికి
(||pallavi||)
sālum̐ jālu nādoḍi sala mem̐ṭigi
ālarivai vuḍigiṁchi ādariṁcha nem̐ṭigi
(||sālu||)
jallajaṁpu gām̐kadoḍa jāgulu seya noba
alāḍa negāṁta virahame sālu
pĕlluna nappaḍi nannum̐ bilavagurā nīvu
yilliṁdām̐kā kām̐kam̐ bĕṭṭi yim̐ka nela priyamu
(||sālu||)
palu maṁchimāḍalanĕ bhramam̐baḍa noba nāgu
alara nīdo vāvāda mayinā melu
tala yĕtti momu sūbi tagulagurā nannu
vŏlasī nŏllaga vuṁḍi vūraḍiṁcha nem̐ṭigi
(||sālu||)
besabĕlli kām̐giḍibiguvugu ne noba
resulado navvu navve vāsule mĕchchu
āsa yichchi śhrīvĕṁkaḍādhiba nannum̐ gūḍidi
vesaḍagā nalayiṁchi vem̐ḍugŏna nem̐ṭigi