చాలుఁ జాలు మాతోను సటలేఁటికి
(॥పల్లవి॥)
చాలుఁ జాలు మాతోను సటలేఁటికి
కోలు ముందుగా మాతో గుట్టు సేయవలెనా
(॥చాలుఁ॥)
పంతగాఁడవు నీమోవి పచ్చి ఇంతేటికాయ
చింతలేనివాఁడవేల చెమరించేవు
బంతినున్నా రిద్దరును భావములు గానవచ్చె
కొంత గొంత మాతోను గుట్టుసేయవలెనా
(॥చాలుఁ॥)
మనసుగలవాఁడవు మాటలేఁటికాఁడవు
కినిసినవాఁడవేల కిందుపడేవు
పెనఁగేరు మీలోని ప్రియమెల్లఁగానవచ్చె
కొనబుఁజేఁతల మాతో గుట్టు సేయవలెనా
(॥చాలుఁ॥)
తమకించనివాఁడవు తగవులేల పెట్టేవు
తెమలనివాడవేల తేరి చూచేవు
అమర శ్రీ వేంకటేశ ఆపె నన్నుఁ గూడితివి
గుమతాన మాతో నింత గుట్టు సేయవలెనా
(||pallavi||)
sālum̐ jālu mādonu saḍalem̐ṭigi
kolu muṁdugā mādo guṭṭu seyavalĕnā
(||sālum̐||)
paṁtagām̐ḍavu nīmovi pachchi iṁteḍigāya
siṁtalenivām̐ḍavela sĕmariṁchevu
baṁtinunnā riddarunu bhāvamulu gānavachchĕ
kŏṁta gŏṁta mādonu guṭṭuseyavalĕnā
(||sālum̐||)
manasugalavām̐ḍavu māḍalem̐ṭigām̐ḍavu
kinisinavām̐ḍavela kiṁdubaḍevu
pĕnam̐geru mīloni priyamĕllam̐gānavachchĕ
kŏnabum̐jem̐tala mādo guṭṭu seyavalĕnā
(||sālum̐||)
tamagiṁchanivām̐ḍavu tagavulela pĕṭṭevu
tĕmalanivāḍavela teri sūsevu
amara śhrī veṁkaḍeśha ābĕ nannum̐ gūḍidivi
gumadāna mādo niṁta guṭṭu seyavalĕnā