సాలు సాలు మాటలు సక్కనుండవు
(॥పల్లవి॥)
సాలు సాలు మాటలు సక్కనుండవు
జోలికాఁడ మమ్ము నేల సొలసేవు నీవు
(॥సాలు॥)
వుట్ల మీఁదటి సుద్దు లో హో యిన్ని యాసారాలు
సెట్లు శామలలోని సేఁతలు మావి
వుట్లు వూరువా లెత్తి పొగడుదునో వుండేవో
గట్టు మా సన్ను లేల కదిసేవు నీవు
(॥సాలు॥)
మందగోసుటాలలోనిమనికి నీవుండేది
పందిటిగవులలోని పడుక మాది
చిందరవందరపని చెప్పుదునో వుండేవో
అందనిపండ్ల కేల యఱ్ఱు చాఁచే విపుడు
(॥సాలు॥)
పిల్లఁగోవి రాగాలు పెలుసు నీ మాటలు
కొల్లగా మఱి పిక కూఁతలు మావి
యెల్లగా శ్రీవేంకటేశ యిట్టే మమ్ముఁ గూడితివి
సెల్లు నీకు నేమయినా సేయవయ్య యింకను
(||pallavi||)
sālu sālu māḍalu sakkanuṁḍavu
joligām̐ḍa mammu nela sŏlasevu nīvu
(||sālu||)
vuṭla mīm̐daḍi suddu lo ho yinni yāsārālu
sĕṭlu śhāmalaloni sem̐talu māvi
vuṭlu vūruvā lĕtti pŏgaḍuduno vuṁḍevo
gaṭṭu mā sannu lela kadisevu nīvu
(||sālu||)
maṁdagosuḍālalonimanigi nīvuṁḍedi
paṁdiḍigavulaloni paḍuga mādi
siṁdaravaṁdarabani sĕppuduno vuṁḍevo
aṁdanibaṁḍla kela yaṭru sām̐se vibuḍu
(||sālu||)
pillam̐govi rāgālu pĕlusu nī māḍalu
kŏllagā maṟi piga kūm̐talu māvi
yĕllagā śhrīveṁkaḍeśha yiṭṭe mammum̐ gūḍidivi
sĕllu nīgu nemayinā seyavayya yiṁkanu