చాలు నూరకుండవయ్య సడి కేల వచ్చీనో
(॥పల్లవి॥)
చాలు నూరకుండవయ్య సడి కేల వచ్చీనో
నాలి నే మోనాన నుంటే నన్నుఁ దడవేవా
(॥పల్లవి॥)
ఆడితి నే నొకమాఁట అందిరివలెనె నేను
యీడ నెగ్గైనఁ జేసుకో యిత వైనఁ జేసుకో
వీడె మియ్య నే రాఁగా విందు వెట్టి పగ లాయ
వాడలో నాయింట నుంటే వాదు వెట్టుకొనేవా
(॥చాలు॥)
మగిడి చూచితి నింతే మగఁడ మంటా నేను
నగినా నగుము కాదాన్నా నన్నుఁ గా దను
వగచితి నీకు నేను వడిఁ జల్ల వేఁ డాయ
మగవాఁడ నై పట్టితే మచ్చరించేవా
(॥చాలు॥)
పాదము లొత్తితి నింతే బడలి వచ్చితి వంటా
సేదతో వెంగెము నీకు సేవగాఁ గైకొంటివో
ఆదరించి శ్రీవెంకటాధిప నన్నుఁ గూడితి
వేద దీర నే మొక్కితే వీడఁగ నాడేవా
(||pallavi||)
sālu nūraguṁḍavayya saḍi kela vachchīno
nāli ne monāna nuṁṭe nannum̐ daḍavevā
(||pallavi||)
āḍidi ne nŏgamām̐ṭa aṁdirivalĕnĕ nenu
yīḍa nĕggainam̐ jesugo yida vainam̐ jesugo
vīḍĕ miyya ne rām̐gā viṁdu vĕṭṭi paga lāya
vāḍalo nāyiṁṭa nuṁṭe vādu vĕṭṭugŏnevā
(||sālu||)
magiḍi sūsidi niṁte magam̐ḍa maṁṭā nenu
naginā nagumu kādānnā nannum̐ gā danu
vagasidi nīgu nenu vaḍim̐ jalla vem̐ ḍāya
magavām̐ḍa nai paṭṭide machchariṁchevā
(||sālu||)
pādamu lŏttidi niṁte baḍali vachchidi vaṁṭā
sedado vĕṁgĕmu nīgu sevagām̐ gaigŏṁṭivo
ādariṁchi śhrīvĕṁkaḍādhiba nannum̐ gūḍidi
veda dīra ne mŏkkide vīḍam̐ga nāḍevā