చాలు నూరకే రావయ్య సారె సారె రేఁచక
(॥పల్లవి॥)
చాలు నూరకే రావయ్య సారె సారె రేఁచక
కోలుముందై నీ ప్రియాలు కొంకులుదేరీ నవె
(॥చాలు॥)
గరిసించరాదుగాని కాంతకు నీచేఁతలెల్లా
తెరమఱఁగు దీసితే తిద్దరానివే
వరుసతో రావుగాని వన్నెల నీగుణములు
తొరలించుకొంటేను దొమ్మిసేసేవే
(॥చాలు॥)
వెలఇంచరాదుగాని వెలఁదికి నీ నవ్వులు
తెలిపి చెప్పఁగఁబోతే తీగెసాగేవే
తలఁచఁగరాదుగాని తప్పని నీబాసలెల్లా
ములిగి మోవఁగఁబోతే మోఁపెఁడేసివే
(॥చాలు॥)
ఇయ్యకొనరాదుగాని యింతికి నీ కూటములు
చెయ్యారఁ గాఁగిట నేఁడు చేకొన్నవే
ఇయ్యెడ శ్రీ వేంకటేశ యిద్దరూ నొక్కటైతిరి
ముయ్యఁబోతే మీఁద మీఁద మొనలు చూపేటివే
(||pallavi||)
sālu nūrage rāvayya sārĕ sārĕ rem̐saga
kolumuṁdai nī priyālu kŏṁkuluderī navĕ
(||sālu||)
garisiṁcharādugāni kāṁtagu nīsem̐talĕllā
tĕramaṟam̐gu dīside tiddarānive
varusado rāvugāni vannĕla nīguṇamulu
tŏraliṁchugŏṁṭenu dŏmmiseseve
(||sālu||)
vĕla̮iṁcharādugāni vĕlam̐digi nī navvulu
tĕlibi sĕppam̐gam̐bode tīgĕsāgeve
talam̐sam̐garādugāni tappani nībāsalĕllā
muligi movam̐gam̐bode mom̐pĕm̐ḍesive
(||sālu||)
iyyagŏnarādugāni yiṁtigi nī kūḍamulu
sĕyyāram̐ gām̐giḍa nem̐ḍu segŏnnave
iyyĕḍa śhrī veṁkaḍeśha yiddarū nŏkkaḍaidiri
muyyam̐bode mīm̐da mīm̐da mŏnalu sūbeḍive