Saalu nimtagobaalu salamani

చాలు నింతకోపాలు చలమని
Language

(॥పల్లవి॥)
చాలు నింతకోపాలు చలమని
పాలించఁ దనకేమి పంతమని

(॥॥)
అంటిరా మీరు ఆమాఁట పతితో
యింటికి విచ్చేయుఁ డిప్పుడని
నంటునా తాను నాఁటఁగఁ జూచినఁ
గంటివేదనలు ఘనమని

(॥॥)
ఆంపెనా మిమ్ము నాతఁడు నావద్ది-
కింపుల నామోహ మెక్కెనని
ముంపునఁ జేసిన మొన్నటిచేఁతలు
మంపునఁ నెన్నఁడు మఱవనని

(॥॥)
వచ్చెనా తాను వాకిటి కిప్పుడె
యిచ్చల నేఁపఁగ నేఁటికని
యిచ్చట శ్రీ వేంకటేశుఁడు గూడెను
నిచ్చలుఁ దానే నేనని

(||pallavi||)
sālu niṁtagobālu salamani
pāliṁcham̐ danagemi paṁtamani

(||||)
aṁṭirā mīru āmām̐ṭa padido
yiṁṭigi vichcheyum̐ ḍippuḍani
naṁṭunā tānu nām̐ṭam̐gam̐ jūsinam̐
gaṁṭivedanalu ghanamani

(||||)
āṁpĕnā mimmu nādam̐ḍu nāvaddi-
kiṁpula nāmoha mĕkkĕnani
muṁpunam̐ jesina mŏnnaḍisem̐talu
maṁpunam̐ nĕnnam̐ḍu maṟavanani

(||||)
vachchĕnā tānu vāgiḍi kippuḍĕ
yichchala nem̐pam̐ga nem̐ṭigani
yichchaḍa śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕnu
nichchalum̐ dāne nenani