Saalavaa nee mannanalu samugaana nive maagu

చాలవా నీ మన్ననలు సముకాన నివె మాకు
Language

(॥పల్లవి॥)
చాలవా నీ మన్ననలు సముకాన నివె మాకు
కేలు చాఁచి కొసరేనా కిమ్ముల నింకాను

(॥చాలా॥)
ఆదికొని నీవు నాతో నట్టె యేల పెసఁగేవు
కాదంటినా నీతో పొందు కలకాలము
పోదితో నప్పటినేల పొదిగి వేఁడుకొనేవు
సాదించేనా నీతో చలము లింకాను

(॥చాలా॥)
గుట్టుగోడ నీవేల కొంగువట్టి తీసేవు
వెట్టిచుట్టాలమా నిన్ను వేసరించను
బట్టబయల నింతేల పైపైఁ దమకించేవు
తట్టి నామనసు నీకు దాఁచేనా ఇంకాను

(॥చాలా॥)
కందువ లాలించి యేల కాఁగిట బిగించేవు
నింద లెంచి తప్పు మోపి నిన్ను మీరేనా
ఇందరిలోశ్రీవేంకటేశ నన్ను నేలితివి
అందుకోలుజాణతనా లాడేనా ఇంకాను

(||pallavi||)
sālavā nī mannanalu samugāna nivĕ māgu
kelu sām̐si kŏsarenā kimmula niṁkānu

(||sālā||)
ādigŏni nīvu nādo naṭṭĕ yela pĕsam̐gevu
kādaṁṭinā nīdo pŏṁdu kalagālamu
podido nappaḍinela pŏdigi vem̐ḍugŏnevu
sādiṁchenā nīdo salamu liṁkānu

(||sālā||)
guṭṭugoḍa nīvela kŏṁguvaṭṭi tīsevu
vĕṭṭisuṭṭālamā ninnu vesariṁchanu
baṭṭabayala niṁtela paibaim̐ damagiṁchevu
taṭṭi nāmanasu nīgu dām̐senā iṁkānu

(||sālā||)
kaṁduva lāliṁchi yela kām̐giḍa bigiṁchevu
niṁda lĕṁchi tappu mobi ninnu mīrenā
iṁdarilośhrīveṁkaḍeśha nannu nelidivi
aṁdugolujāṇadanā lāḍenā iṁkānu