Saaladaa yee bhaagyamu sarivaarilonella

చాలదా యీ భాగ్యము సరివారిలోనెల్ల
Language

(॥పల్లవి॥)
చాలదా యీ భాగ్యము సరివారిలోనెల్ల
తాలిమితోఁ గంటిమి సంతసమాయ మాకును

(॥చాల॥)
ముద్దులు నీతో గునిసి మొగమిచ్చమాటలాడి
కొద్దిమీర నినుఁ జేకొనఁగా యాకె
వొద్దిక సేవలు సేసి వొడివట్టుకొని నవ్వి
దిద్దుకొని పనులకుఁ దిప్పెఁగా ఆకె

(॥చాల॥)
సోయగపూపు చూచి చొక్కి నీమీఁద నొరగి
ఆయములు గరఁగఁ చాలారెచ్చఁగా ఆకె
చాయలు సన్నలు జూపి సంగడినే కూచుండ
చేయంటి వలపులఁ జిక్కించెఁగా ఆకె

(॥చాల॥)
కమ్మరాను నెలయించి కాఁగిట నిన్నుఁ గూడి
కిమ్ములను నిన్ను మరిగించెఁగా ఆకె
ఇమ్ముల శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
యెమ్మెలతో నిందు కప్పణిచ్చెఁగా ఆకె

(||pallavi||)
sāladā yī bhāgyamu sarivārilonĕlla
tālimidom̐ gaṁṭimi saṁtasamāya māgunu

(||sāla||)
muddulu nīdo gunisi mŏgamichchamāḍalāḍi
kŏddimīra ninum̐ jegŏnam̐gā yāgĕ
vŏddiga sevalu sesi vŏḍivaṭṭugŏni navvi
diddugŏni panulagum̐ dippĕm̐gā āgĕ

(||sāla||)
soyagabūbu sūsi sŏkki nīmīm̐da nŏragi
āyamulu garam̐gam̐ sālārĕchcham̐gā āgĕ
sāyalu sannalu jūbi saṁgaḍine kūsuṁḍa
seyaṁṭi valabulam̐ jikkiṁchĕm̐gā āgĕ

(||sāla||)
kammarānu nĕlayiṁchi kām̐giḍa ninnum̐ gūḍi
kimmulanu ninnu marigiṁchĕm̐gā āgĕ
immula śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
yĕmmĕlado niṁdu kappaṇichchĕm̐gā āgĕ