Saaladaa naagimta ninnu sari gannulam joosedi

చాలదా నాకింత నిన్ను సరి గన్నులఁ జూచేది
Language

(॥పల్లవి॥)
చాలదా నాకింత నిన్ను సరి గన్నులఁ జూచేది
వేళవచ్చినఁ దామెర విరియక మానునా

(॥చాల॥)
అలిగి నీవవ్వలిమోమైనా నవుదువుగాక
తలపు నామీఁదనే తగులుగాదా
మొలచి రత్నదీప మేమొకమై తానుండినాను
వెలుఁగు ఇంటిలోనెల్ల వెలయకుండీనా

(॥చాల॥)
యెమ్మెల నీ విటు నన్ను నెంతవొల్లకుండినాను
దిమ్ముల నీసతిననేతేజము లేదా
కమ్మర శశిఁ గొన్నాళ్ళు కళలుదీసివుండినా
నెమ్మది మరికొన్నాళ్లు నిండకుండీనా

(॥చాల॥)
పట్టినచలము మాని పంతము నాకిత్తుగాక
ముట్టి నేను గతిగూడ మొక్కకుండేనా
గుట్టున శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
పుట్టినపూవున బిందె పొడమకుండీనా

(||pallavi||)
sāladā nāgiṁta ninnu sari gannulam̐ jūsedi
veḽavachchinam̐ dāmĕra viriyaga mānunā

(||sāla||)
aligi nīvavvalimomainā navuduvugāga
talabu nāmīm̐dane tagulugādā
mŏlasi ratnadība memŏgamai tānuṁḍinānu
vĕlum̐gu iṁṭilonĕlla vĕlayaguṁḍīnā

(||sāla||)
yĕmmĕla nī viḍu nannu nĕṁtavŏllaguṁḍinānu
dimmula nīsadinanedejamu ledā
kammara śhaśhim̐ gŏnnāḽḽu kaḽaludīsivuṁḍinā
nĕmmadi marigŏnnāḽlu niṁḍaguṁḍīnā

(||sāla||)
paṭṭinasalamu māni paṁtamu nāgittugāga
muṭṭi nenu gadigūḍa mŏkkaguṁḍenā
guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
puṭṭinabūvuna biṁdĕ pŏḍamaguṁḍīnā