చాలదా ఇంత సారెసారె వలెనా । తాను
(॥పల్లవి॥)
చాలదా ఇంత సారెసారె వలెనా । తాను
యేల చలమున నిఁక నేమి సేయుమనీని
(॥చాల॥)
మొక్కితిఁగదె తనకు మొన్ననే నేను
యెక్కడనుండిన మనసేకమని
దక్కితి నంటిఁగదె తనపాలికి
యిక్కడఁ జెలులమాటలెల్లాన నే వింటినే
(॥చాల॥)
ఇచ్చితిఁగదె పంత మింతకుముందె నాకు
హెచ్చి తా నాడినమాట లియ్యకోలని
మెచ్చితిఁ గదెతన్ను మీఁదమీఁదనె మరి
పచ్చియెమ్మెలు నావద్దఁ బచరించనేఁటికే
(॥చాల॥)
అంటితిఁగదె తనఆయము నేనే ఇది
దంటపాయ మిందరికిఁ దగునని
గుంటిపై శ్రీవేంకటేశుఁ గూడితిఁగదె ఇఁక
వెంటవెంటఁ దను నే విడువనని
(||pallavi||)
sāladā iṁta sārĕsārĕ valĕnā | tānu
yela salamuna nim̐ka nemi seyumanīni
(||sāla||)
mŏkkidim̐gadĕ tanagu mŏnnane nenu
yĕkkaḍanuṁḍina manasegamani
dakkidi naṁṭim̐gadĕ tanabāligi
yikkaḍam̐ jĕlulamāḍalĕllāna ne viṁṭine
(||sāla||)
ichchidim̐gadĕ paṁta miṁtagumuṁdĕ nāgu
hĕchchi tā nāḍinamāḍa liyyagolani
mĕchchidim̐ gadĕdannu mīm̐damīm̐danĕ mari
pachchiyĕmmĕlu nāvaddam̐ basariṁchanem̐ṭige
(||sāla||)
aṁṭidim̐gadĕ tanaāyamu nene idi
daṁṭabāya miṁdarigim̐ dagunani
guṁṭibai śhrīveṁkaḍeśhum̐ gūḍidim̐gadĕ im̐ka
vĕṁṭavĕṁṭam̐ danu ne viḍuvanani