Saagiri meere sumdi sadulaalaa

సాకిరి మీరే సుండి సతులాలా
Language

(॥పల్లవి॥)
సాకిరి మీరే సుండి సతులాలా
యీకడ నన్నే నేరా లెంచ రాకు రమ్మా

(॥సాకిరి॥)
వుడివోని తమకాన వొక టొక టాడ వచ్చీ
తడవము తాఁకము తా నేమే వీఁడు
నడుమ నే నే మన్న నానోరె గనమే
వుడుకు నూరుపుతోడ నూరకుండే నమ్మా

(॥సాకిరి॥)
చిత్తిణిగుణముతోడ చేతులు చాఁచఁగ వచ్చీ
బత్తి గలవానివలె పై పై వీఁడు
అత్తినేఁ గోపగించితే నందరు నన్నే దూరేరు
కొత్త నివ్వెరగుతోడఁ గూచుండే నమ్మా

(॥సాకిరి॥)
యెవ్వరి ముందర నైన యెమ్మెకే నవ్వఁగ వచ్చీ
పవ్వళించాఁ బోనీఁడు పదరి వీఁడు
యివ్వలఁ గడపరాయఁ డిదె శ్రీవెంకటగిరి
నివ్వటిల్ల నన్నుఁ గూడె నెయ్య మైతి నమ్మా

(||pallavi||)
sāgiri mīre suṁḍi sadulālā
yīgaḍa nanne nerā lĕṁcha rāgu rammā

(||sāgiri||)
vuḍivoni tamagāna vŏga ṭŏga ṭāḍa vachchī
taḍavamu tām̐kamu tā neme vīm̐ḍu
naḍuma ne ne manna nānorĕ ganame
vuḍugu nūrubudoḍa nūraguṁḍe nammā

(||sāgiri||)
sittiṇiguṇamudoḍa sedulu sām̐sam̐ga vachchī
batti galavānivalĕ pai pai vīm̐ḍu
attinem̐ gobagiṁchide naṁdaru nanne dūreru
kŏtta nivvĕragudoḍam̐ gūsuṁḍe nammā

(||sāgiri||)
yĕvvari muṁdara naina yĕmmĕge navvam̐ga vachchī
pavvaḽiṁchām̐ bonīm̐ḍu padari vīm̐ḍu
yivvalam̐ gaḍabarāyam̐ ḍidĕ śhrīvĕṁkaḍagiri
nivvaḍilla nannum̐ gūḍĕ nĕyya maidi nammā