సాదుఁగొయ్య వైనాఁడవు సరికి బేసికి నీవు
(॥పల్లవి॥)
సాదుఁగొయ్య వైనాఁడవు సరికి బేసికి నీవు
యేది నిజ మేది గల్ల యేమిసేతునయ్యా
(॥॥)
బిగియరాదు నీకుఁ బ్రియము చెప్పఁగరాదు
నగరాదు చూపులు నాటించరాదు
సగము మంచితనము సగము బింకము చూపే
వెగసక్కెవువిభుఁడ వేమి సేతువయ్యా
(॥॥)
బొమ్మల జంకించరాదు పొందులు చూపఁగరాదు
కెమ్మోవి యడుగరాదు కినియరాదు
దిమ్మరితనము గొంత దిట్టరాజసము గొంత
యెమ్మెకాఁడ వై నాఁడ వేమిసేతువయ్యా
(॥॥)
మచ్చిక మానరాదు మనసు సోదించరాదు
కొచ్చి శ్రీవేంకటేశుఁడ కూడితి నన్ను
పచ్చిసేఁతలు బాసలు నీవాకునను
యిచ్చకుఁడ వై నాఁడ వేమి సేతునయ్యా
(||pallavi||)
sādum̐gŏyya vainām̐ḍavu sarigi besigi nīvu
yedi nija medi galla yemisedunayyā
(||||)
bigiyarādu nīgum̐ briyamu sĕppam̐garādu
nagarādu sūbulu nāḍiṁcharādu
sagamu maṁchidanamu sagamu biṁkamu sūbe
vĕgasakkĕvuvibhum̐ḍa vemi seduvayyā
(||||)
bŏmmala jaṁkiṁcharādu pŏṁdulu sūbam̐garādu
kĕmmovi yaḍugarādu kiniyarādu
dimmaridanamu gŏṁta diṭṭarājasamu gŏṁta
yĕmmĕgām̐ḍa vai nām̐ḍa vemiseduvayyā
(||||)
machchiga mānarādu manasu sodiṁcharādu
kŏchchi śhrīveṁkaḍeśhum̐ḍa kūḍidi nannu
pachchisem̐talu bāsalu nīvāgunanu
yichchagum̐ḍa vai nām̐ḍa vemi sedunayyā