Saadiseppidimi neegu jadiyaraadu

చాటిచెప్పితిమి నీకు జడియరాదు
Language

(॥పల్లవి॥)
చాటిచెప్పితిమి నీకు జడియరాదు
మాటలివి నాయకుఁడ మఱవరాదు

(॥॥)
సరసమెంతాడినాను చన్నుల నెంత వొత్తినా
తరుణి కిచ్చినబాస తప్పఁగరాదు
విరులనెంత వేసిన వెంగములెన్నాడినాను
తిరమై చల్లినసేస తియ్యఁ గారాదు

(॥॥)
మునిగోర గీరెనంటా ముప్పిరిఁ బెనఁగెనంటా
వనితపొందులు ఇఁక వదలరాదు
కనుఁ గోన నవ్వెనంటా కడునెలయించెనంటా
యెనసి కూడుండి మరి యెడయరాదు

(॥॥)
మంకులు చూపినందుకు మర్మము లంటినందుకు
కంకణము గట్టి అతికడవరాదు
లంకెలై శ్రీ వేంకటేశ్వర లలనఁ గూడితి విట్టె
అంకెలవలపు లిఁక నడఁచరాదు

(||pallavi||)
sāḍisĕppidimi nīgu jaḍiyarādu
māḍalivi nāyagum̐ḍa maṟavarādu

(||||)
sarasamĕṁtāḍinānu sannula nĕṁta vŏttinā
taruṇi kichchinabāsa tappam̐garādu
virulanĕṁta vesina vĕṁgamulĕnnāḍinānu
tiramai sallinasesa tiyyam̐ gārādu

(||||)
munigora gīrĕnaṁṭā muppirim̐ bĕnam̐gĕnaṁṭā
vanidabŏṁdulu im̐ka vadalarādu
kanum̐ gona navvĕnaṁṭā kaḍunĕlayiṁchĕnaṁṭā
yĕnasi kūḍuṁḍi mari yĕḍayarādu

(||||)
maṁkulu sūbinaṁdugu marmamu laṁṭinaṁdugu
kaṁkaṇamu gaṭṭi adigaḍavarādu
laṁkĕlai śhrī veṁkaḍeśhvara lalanam̐ gūḍidi viṭṭĕ
aṁkĕlavalabu lim̐ka naḍam̐sarādu