సాదించితివి విద్యలు సంకరుషణా మంచి
(॥పల్లవి॥)
సాదించితివి విద్యలు సంకరుషణా మంచి-
సాదువలె నుండే నీవు సంకరుషణా
(॥సాదించి॥)
సన్న లింకఁ దెలుసుకో సంకరుషణా మా
చన్నులపై కొంగు జారె సంకరుషణా
జన్నెవలపు చల్లేవు సంకరుషణా యింక
సన్న యేమి దొడ్డ యేమి సంకరుషణా
(॥సాదించి॥)
జాజరకాఁడవా నీవు సంకరుషణా కొప్పు
జాజులు పై రాలించేవు సంకరుషణా
జాజుకో నంబుల రేఁచే సంకరుషణా మా
సాజము నీకుఁ జెప్పేము సంకరుషణా
(॥సాదించి॥)
సాములు మాతోడనా సంకరుషణా
జాము జాము కొకపరి సంకరుషణా
స్వామివి శ్రీవేంకటాద్రి సంకరుషణా
సామాన నన్నుఁ గూడితి సంకరుషణా
(||pallavi||)
sādiṁchidivi vidyalu saṁkaruṣhaṇā maṁchi-
sāduvalĕ nuṁḍe nīvu saṁkaruṣhaṇā
(||sādiṁchi||)
sanna liṁkam̐ dĕlusugo saṁkaruṣhaṇā mā
sannulabai kŏṁgu jārĕ saṁkaruṣhaṇā
jannĕvalabu sallevu saṁkaruṣhaṇā yiṁka
sanna yemi dŏḍḍa yemi saṁkaruṣhaṇā
(||sādiṁchi||)
jājaragām̐ḍavā nīvu saṁkaruṣhaṇā kŏppu
jājulu pai rāliṁchevu saṁkaruṣhaṇā
jājugo naṁbula rem̐se saṁkaruṣhaṇā mā
sājamu nīgum̐ jĕppemu saṁkaruṣhaṇā
(||sādiṁchi||)
sāmulu mādoḍanā saṁkaruṣhaṇā
jāmu jāmu kŏgabari saṁkaruṣhaṇā
svāmivi śhrīveṁkaḍādri saṁkaruṣhaṇā
sāmāna nannum̐ gūḍidi saṁkaruṣhaṇā