Saadimchanemtigi neevu saaresaaregu

సాదించనేఁటికి నీవు సారెసారెకు
Language

(॥పల్లవి॥)
సాదించనేఁటికి నీవు సారెసారెకు
భేదములేక కూడితే పెనఁగులాడేమా

(॥సాదిం॥)
చెంగటనుండి నీవు చేసినదెల్లాఁ జేయఁగా
అంగనలము మాలో నేమాడుకోరాదా
సంగతిగా నీవు తొల్లె సాదువలె నుండితేను
పంగించి నిన్నటు భంగపరచవచ్చేమా

(॥సాదిం॥)
వుడివోనిచిన్నలు నీవొళ్లిమీఁద నుండంగాను
నడుమ మాలో నేము నవ్వుకోరాదా
సడిలేని గుణముతో చక్కఁగా మెలఁగితేను
కొడిమెలు గట్టి నిన్ను కోపగించేమా

(॥సాదిం॥)
కప్పి యందరివి నీవు కాఁగిలించకూడఁగాను
చొప్పులు మాలో నేము చూచుకోరాదా
యెప్పుడూ శ్రీవేంకటేశ యెడయక యేలితేను
తప్పులెంచి నీసుద్దులు తారుకాణించేమా

(||pallavi||)
sādiṁchanem̐ṭigi nīvu sārĕsārĕgu
bhedamulega kūḍide pĕnam̐gulāḍemā

(||sādiṁ||)
sĕṁgaḍanuṁḍi nīvu sesinadĕllām̐ jeyam̐gā
aṁganalamu mālo nemāḍugorādā
saṁgadigā nīvu tŏllĕ sāduvalĕ nuṁḍidenu
paṁgiṁchi ninnaḍu bhaṁgabarasavachchemā

(||sādiṁ||)
vuḍivonisinnalu nīvŏḽlimīm̐da nuṁḍaṁgānu
naḍuma mālo nemu navvugorādā
saḍileni guṇamudo sakkam̐gā mĕlam̐gidenu
kŏḍimĕlu gaṭṭi ninnu kobagiṁchemā

(||sādiṁ||)
kappi yaṁdarivi nīvu kām̐giliṁchagūḍam̐gānu
sŏppulu mālo nemu sūsugorādā
yĕppuḍū śhrīveṁkaḍeśha yĕḍayaga yelidenu
tappulĕṁchi nīsuddulu tārugāṇiṁchemā