Saadimcham bodduledu jamkimcha velaledu

సాదించఁ బొద్దులేదు జంకించ వేళలేదు
Language

(॥పల్లవి॥)
సాదించఁ బొద్దులేదు జంకించ వేళలేదు
యీ దెస రమణునికి ఇంత లోనైతి

(॥సాదిం॥)
అలిగి నేరాఁగా నప్పుడే మొగము చూపి
తెలిఁగన్నుల నవ్వితే తీరెఁ గోపము
తలవంచుకుండగానే దగ్గరనే నిలుచుండి
కలకల మాటాడిఁతే గక్కున నే నవ్వితి

(॥సాదిం॥)
ఆకడి మోమై వుంటే ఆయములు గరఁగంగ
కైకొని పైనొరగితే కందు వాసెను
చీకాకు నిట్టూరుపుల చిముడఁగ వెనకకు
కోకవట్టి తీసితే గక్కున సమ్మతించితి

(॥సాదిం॥)
చెక్కుచేత నే నుండఁగ చేయిజేయి గీలించి
తొక్కినపాదములోనే దొరసెఁబొందు
యిక్కువ శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె
గక్కన నలమేల్మంగఁ గనక మోహించితి

(||pallavi||)
sādiṁcham̐ bŏdduledu jaṁkiṁcha veḽaledu
yī dĕsa ramaṇunigi iṁta lonaidi

(||sādiṁ||)
aligi nerām̐gā nappuḍe mŏgamu sūbi
tĕlim̐gannula navvide tīrĕm̐ gobamu
talavaṁchuguṁḍagāne daggarane nilusuṁḍi
kalagala māḍāḍim̐te gakkuna ne navvidi

(||sādiṁ||)
āgaḍi momai vuṁṭe āyamulu garam̐gaṁga
kaigŏni painŏragide kaṁdu vāsĕnu
sīgāgu niṭṭūrubula simuḍam̐ga vĕnagagu
kogavaṭṭi tīside gakkuna sammadiṁchidi

(||sādiṁ||)
sĕkkuseda ne nuṁḍam̐ga seyijeyi gīliṁchi
tŏkkinabādamulone dŏrasĕm̐bŏṁdu
yikkuva śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
gakkana nalamelmaṁgam̐ ganaga mohiṁchidi