Saadi seppidi mibude samtamaude melu

చాటి చెప్పితి మిపుడే సంతమౌటే మేలు
Language

(॥పల్లవి॥)
చాటి చెప్పితి మిపుడే సంతమౌటే మేలు
వాటముగఁ జెలిమి మఱవకుమయ్యా యిఁకను

(॥చాటి॥)
సుదతి కనుచూపులకు సొరిది నొడ్డుకోరాదు
అదరు వెన్నెలనవ్వు కడ్డము లేదు
తుద బొమ్మజంకెనలు తొలఁగ దొబ్బఁగరాదు
ముదురు వలపులు మిగుల ముంచుకొనునపుడు

(॥చాటి॥)
కొనగోరివాఁడి మరి గురిదప్పుకొనరాదు
చెనకుఁ జేఁతుల కోరసేయరాదు
మనసు కరఁగింపులకు మరఁగువెట్టఁగరాదు
తనివోని కోరికలు తగులుకొనునపుడు

(॥చాటి॥)
వలుద చనుగుబ్బలకు వడి మాటుకొనరాదు
కలయుకాఁగిటికి తెరఁగట్టరాదు
యెలమి శ్రీవేంకటేశ ఇపు డీకెఁ గూడితివి
కలుగుఁ దమకము లిట్లఁ గరుణించినపుడు

(||pallavi||)
sāḍi sĕppidi mibuḍe saṁtamauḍe melu
vāḍamugam̐ jĕlimi maṟavagumayyā yim̐kanu

(||sāḍi||)
sudadi kanusūbulagu sŏridi nŏḍḍugorādu
adaru vĕnnĕlanavvu kaḍḍamu ledu
tuda bŏmmajaṁkĕnalu tŏlam̐ga dŏbbam̐garādu
muduru valabulu migula muṁchugŏnunabuḍu

(||sāḍi||)
kŏnagorivām̐ḍi mari guridappugŏnarādu
sĕnagum̐ jem̐tula koraseyarādu
manasu karam̐giṁpulagu maram̐guvĕṭṭam̐garādu
tanivoni korigalu tagulugŏnunabuḍu

(||sāḍi||)
valuda sanugubbalagu vaḍi māḍugŏnarādu
kalayugām̐giḍigi tĕram̐gaṭṭarādu
yĕlami śhrīveṁkaḍeśha ibu ḍīgĕm̐ gūḍidivi
kalugum̐ damagamu liṭlam̐ garuṇiṁchinabuḍu