రెంటికినిఁ గొరగాని రేవనికత గా కిట్టి
(॥పల్లవి॥)
రెంటికినిఁ గొరగాని రేవనికత గా కిట్టి
సొంటులు సోదించి నీవు చూచుకో వో జీవుఁడా
(॥రెంటి॥)
విచారించి చూచితేను విశ్వము కిందనే నూయి
పచరించితే మీఁదు పరబ్రహ్మము
రచించి యీ రెంటికి నిరవు మన సొకటి
సుచారిత్రుఁడవై నీవు చూచుకో వో జీవుఁడాఁ
(॥రెంటి॥)
తట్టి పాఁకఁబోతేను బయలెల్ల బందీలే
కొట్టగొన కెక్కితేను కొండిపీట
ఱట్టుగాని రెంటికి నెఱయ దేహమే గుఱి
మట్టెల్ల మాని నీవు చూచుకో వో జీవుఁడా
(॥రెంటి॥)
మఱచి వూరకుండితే మాయలే జన్మము లెల్ల
యెఱిఁగితే శ్రీవేంకటేశుఁడే
తఱితోఁ దాఁగైకొంటే తానే రెంటికి మూలము
చుఱుకు గలిగి నీవే చూచుకో వో జీవుఁడా
(||pallavi||)
rĕṁṭiginim̐ gŏragāni revanigada gā kiṭṭi
sŏṁṭulu sodiṁchi nīvu sūsugo vo jīvum̐ḍā
(||rĕṁṭi||)
visāriṁchi sūsidenu viśhvamu kiṁdane nūyi
pasariṁchide mīm̐du parabrahmamu
rasiṁchi yī rĕṁṭigi niravu mana sŏgaḍi
susāritrum̐ḍavai nīvu sūsugo vo jīvum̐ḍām̐
(||rĕṁṭi||)
taṭṭi pām̐kam̐bodenu bayalĕlla baṁdīle
kŏṭṭagŏna kĕkkidenu kŏṁḍibīḍa
ṟaṭṭugāni rĕṁṭigi nĕṟaya dehame guṟi
maṭṭĕlla māni nīvu sūsugo vo jīvum̐ḍā
(||rĕṁṭi||)
maṟasi vūraguṁḍide māyale janmamu lĕlla
yĕṟim̐gide śhrīveṁkaḍeśhum̐ḍe
taṟidom̐ dām̐gaigŏṁṭe tāne rĕṁṭigi mūlamu
suṟugu galigi nīve sūsugo vo jīvum̐ḍā