Remtigi vachchum gade neereedulu seli

రెంటికి వచ్చుఁ గదే నీరీతులు చెలి
Language

(॥పల్లవి॥)
రెంటికి వచ్చుఁ గదే నీరీతులు చెలి
ఇంటనుండి మమ్ము నేఁప నింతేలే నీకు

(॥॥)
సిగ్గుతోఁ బెట్టినయట్టి చెలి నీచెక్కిటివేయి
వెగ్గళపుఁ జింతలంటా వెరచితిమే
బగ్గన నీవుయ్యాలపై నూఁగేపయ్యదజారు
నిగ్గుల విరహమంటా నివ్వెర గందితిమే

(॥॥)
ముసిముసినవ్వులతో మోనాన నీవున్నకీలు
పసురుఁగోపములంటా భ్రమసితిమే
అనురులతోడి యలవోక నిద్దురలు
కొసరునలుకలంటాఁ గొంకితిమే నేము

(॥॥)
శ్రీ వేంకటేశుతో నీచేముట్టినసరసాలు
తావుల మీవాదులంటాఁ దలఁకితిమే
వోవరిలో మీరిద్దరు నినగూడి వుండఁగాను
చేవదేరెఁ బనులంటాఁజెలఁగితిమే

(||pallavi||)
rĕṁṭigi vachchum̐ gade nīrīdulu sĕli
iṁṭanuṁḍi mammu nem̐pa niṁtele nīgu

(||||)
siggudom̐ bĕṭṭinayaṭṭi sĕli nīsĕkkiḍiveyi
vĕggaḽabum̐ jiṁtalaṁṭā vĕrasidime
baggana nīvuyyālabai nūm̐gebayyadajāru
niggula virahamaṁṭā nivvĕra gaṁdidime

(||||)
musimusinavvulado monāna nīvunnagīlu
pasurum̐gobamulaṁṭā bhramasidime
anuruladoḍi yalavoga nidduralu
kŏsarunalugalaṁṭām̐ gŏṁkidime nemu

(||||)
śhrī veṁkaḍeśhudo nīsemuṭṭinasarasālu
tāvula mīvādulaṁṭām̐ dalam̐kidime
vovarilo mīriddaru ninagūḍi vuṁḍam̐gānu
sevaderĕm̐ banulaṁṭām̐jĕlam̐gidime