రేపయ్యీ మాపయ్యీ రేసులు వోనివే
(॥పల్లవి॥)
రేపయ్యీ మాపయ్యీ రేసులు వోనివే
చేపట్టినదే చాలు సిగ్గులు వోనివే
(॥రేపయ్యీ॥)
రమ్మని పిలిచే విప్పుడే రాజసములపతివద్దకు
చిమ్ముల నా మతి చింతల చీఁకటి వోనివో
నెమ్మదిఁ దనతో నవ్వక నే నే లూరకయుండే
సమ్మతి నా నిట్టూర్పుల సందడి వోనివే
(॥రేపయ్యీ॥)
ఘనుఁడదే చూచెను మొక్కుము కడమెడఁ దని చూపెదు
చినికెడుచేతుల చెమటలచిత్తడి వోనివే
ననుపులఁ దను నే నంటక నా మన సెటువలె నిలిచీ
యెనయఁగఁ జెఱఁ గిటు మాసిన యెంగిలి వోనివే
(॥రేపయ్యీ॥)
శ్రీవేంకటపతి పానుపు చేరె ననుచుఁ దమకించెదు
భావములోపలిమరుఁ డొకపనికే పో నివే
కావిరిఁదా ననుఁ గూడెను కరఁచక నే నేలుండే
వావుల తన నా లోపలివాసులు వోనివే
(||pallavi||)
rebayyī mābayyī resulu vonive
sebaṭṭinade sālu siggulu vonive
(||rebayyī||)
rammani pilise vippuḍe rājasamulabadivaddagu
simmula nā madi siṁtala sīm̐kaḍi vonivo
nĕmmadim̐ danado navvaga ne ne lūragayuṁḍe
sammadi nā niṭṭūrbula saṁdaḍi vonive
(||rebayyī||)
ghanum̐ḍade sūsĕnu mŏkkumu kaḍamĕḍam̐ dani sūbĕdu
sinigĕḍusedula sĕmaḍalasittaḍi vonive
nanubulam̐ danu ne naṁṭaga nā mana sĕḍuvalĕ nilisī
yĕnayam̐gam̐ jĕṟam̐ giḍu māsina yĕṁgili vonive
(||rebayyī||)
śhrīveṁkaḍabadi pānubu serĕ nanusum̐ damagiṁchĕdu
bhāvamulobalimarum̐ ḍŏgabanige po nive
kāvirim̐dā nanum̐ gūḍĕnu karam̐saga ne neluṁḍe
vāvula tana nā lobalivāsulu vonive