Ravvalainaanaayam gaani raampainaanaidim gaani

రవ్వలైనానాయఁ గాని రాఁపైనానైతిఁ గాని
Language

(॥పల్లవి॥)
రవ్వలైనానాయఁ గాని రాఁపైనానైతిఁ గాని
రివ్వల నీ మోవితేనె రేఁచవద్దా ఇందుకు

(॥రవ్వ॥)
చివ్వన నెందుండో వచ్చి చేముట్టి తీసి నీవు
నవ్వఁగా నీతో నేను నవ్వవద్దా
దువ్వటపుఁ బయ్యెదను తుడిచేవు నీచెమట
జవ్వనమదము నీ పైఁ జల్లవద్దా ఇందుకు

(॥రవ్వ॥)
వొల్లనే వద్దఁ గూచుండి వొడివట్టి రమ్మంటా
గిల్లఁగా నేనూ నందుకు గిల్లవద్దా
మొల్లలు నీ కొప్పువెల్లా ముడిచేవు నా కొప్పున
పెల్లున నాతమ్ములము పెట్టవద్దా ఇందుకు

(॥రవ్వ॥)
గక్కునను నీవు నన్నుఁ గాఁగిలించుకొనఁగానే
వుక్కువంటి నా చన్నుల నొత్తవద్దా
ఇక్కువ శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁగూడితివి
మొక్కలములెల్లా మాని మొక్కవద్దా యిందుకు

(||pallavi||)
ravvalainānāyam̐ gāni rām̐painānaidim̐ gāni
rivvala nī movidenĕ rem̐savaddā iṁdugu

(||ravva||)
sivvana nĕṁduṁḍo vachchi semuṭṭi tīsi nīvu
navvam̐gā nīdo nenu navvavaddā
duvvaḍabum̐ bayyĕdanu tuḍisevu nīsĕmaḍa
javvanamadamu nī paim̐ jallavaddā iṁdugu

(||ravva||)
vŏllane vaddam̐ gūsuṁḍi vŏḍivaṭṭi rammaṁṭā
gillam̐gā nenū naṁdugu gillavaddā
mŏllalu nī kŏppuvĕllā muḍisevu nā kŏppuna
pĕlluna nādammulamu pĕṭṭavaddā iṁdugu

(||ravva||)
gakkunanu nīvu nannum̐ gām̐giliṁchugŏnam̐gāne
vukkuvaṁṭi nā sannula nŏttavaddā
ikkuva śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐gūḍidivi
mŏkkalamulĕllā māni mŏkkavaddā yiṁdugu