Ravva maani aayanaaya raare meeru

రవ్వ మాని ఆయనాయ రారే మీరు
Language

(॥పల్లవి॥)
రవ్వ మాని ఆయనాయ రారే మీరు
అవ్వలఁ దన్నుఁ బిలిచేయంతవారమా

(॥రవ్వ॥)
తడవీనా మమ్మతఁడు తరుణులఁ గడమా
పడఁతు లాతనికైతే పాదరేణువు
బడిబడి నే వలచి పైఁబడేఁగాని తనకు
చిడుముడిఁ జెట్టడువఁ జేటఁడేసిన సతులు

(॥రవ్వ॥)
వలచీనా నా కతఁడు వనితలు లేరా
వలచివచ్చేవారే వనమెల్లాను
వెలయ నేఁ దనపొందు విడువఁగలేఁ గాక
చిలికితే నేమిబాఁతి చెలువలేతనికి

(॥రవ్వ॥)
మానీనా నన్నతఁడు మగువ లెందరుండినా
పూని యాతనిసతులే భూమెల్లాను
యీనెపాన శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁగూడె
కానికగాఁ బూజగొంటే గంపెడేసిసతులు

(||pallavi||)
ravva māni āyanāya rāre mīru
avvalam̐ dannum̐ biliseyaṁtavāramā

(||ravva||)
taḍavīnā mammadam̐ḍu taruṇulam̐ gaḍamā
paḍam̐tu lādanigaide pādareṇuvu
baḍibaḍi ne valasi paim̐baḍem̐gāni tanagu
siḍumuḍim̐ jĕṭṭaḍuvam̐ jeḍam̐ḍesina sadulu

(||ravva||)
valasīnā nā kadam̐ḍu vanidalu lerā
valasivachchevāre vanamĕllānu
vĕlaya nem̐ danabŏṁdu viḍuvam̐galem̐ gāga
siligide nemibām̐ti sĕluvaledanigi

(||ravva||)
mānīnā nannadam̐ḍu maguva lĕṁdaruṁḍinā
pūni yādanisadule bhūmĕllānu
yīnĕbāna śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
kānigagām̐ būjagŏṁṭe gaṁpĕḍesisadulu