Ṟattuseya kimka neevu itte raamgade

ఱట్టుసేయ కిఁక నీవు ఇట్టె రాఁగదే
Language

(॥పల్లవి॥)
ఱట్టుసేయ కిఁక నీవు ఇట్టె రాఁగదే
పట్టపుదేవులవైన బలవంతురాలవు

(॥ఱట్టు॥)
యెదురుఁగొండ లెక్కితివేమే వోచెలియా
యెదురుఁ గొండలచన్ను లెదనుండఁగా
వదలక నల్లఁగలువల వేసే వదియేమే
కదిసి నీచూపులే కలువలై వుండగా

(॥ఱట్టు॥)
యేరు నడుమఁ బెట్టుక యెలయించే విదియేమే
యేరువంటియారు నీకు నిదె వుండఁగా
సారెకు లేఁతతీగెలు జళిపించే విదియేమే
గారాపుతీఁగెలే నీకరములై వుండఁగా

(॥ఱట్టు॥)
పొంది వొక్కచోఁ దరితీపులు వుట్టించేవేమే
ముందుముందే తీపులు నీమోవి నుండఁగా
అందపుశ్రీవేంకటాద్రి నహోబలమునను
ఇందిరపు నీకు నేనే ఇరవైవుండఁగను

(||pallavi||)
ṟaṭṭuseya kim̐ka nīvu iṭṭĕ rām̐gade
paṭṭabudevulavaina balavaṁturālavu

(||ṟaṭṭu||)
yĕdurum̐gŏṁḍa lĕkkidiveme vosĕliyā
yĕdurum̐ gŏṁḍalasannu lĕdanuṁḍam̐gā
vadalaga nallam̐galuvala vese vadiyeme
kadisi nīsūbule kaluvalai vuṁḍagā

(||ṟaṭṭu||)
yeru naḍumam̐ bĕṭṭuga yĕlayiṁche vidiyeme
yeruvaṁṭiyāru nīgu nidĕ vuṁḍam̐gā
sārĕgu lem̐tadīgĕlu jaḽibiṁche vidiyeme
gārābudīm̐gĕle nīgaramulai vuṁḍam̐gā

(||ṟaṭṭu||)
pŏṁdi vŏkkasom̐ daridībulu vuṭṭiṁcheveme
muṁdumuṁde tībulu nīmovi nuṁḍam̐gā
aṁdabuśhrīveṁkaḍādri nahobalamunanu
iṁdirabu nīgu nene iravaivuṁḍam̐ganu