ఱట్టు సేయక రావె యిట్టె నీవు
(॥పల్లవి॥)
ఱట్టు సేయక రావె యిట్టె నీవు
గట్టిగా వచ్చేవంటాఁ గాచుకున్నవాఁడు
(॥ఱట్టు॥)
చెలిమి సేసినవారు చేతికిలోను గావలె
చలములు సాదించ సంగతిగాదు
వలచిన వారలు వద్దఁ బాయకుండవలె
పొలయలుకలు చూపఁ బొసఁగ దెప్పుడును
(॥ఱట్టు॥)
సరస మాడేటివారు సమ్మతించి వుండవలె
నెరసులు పట్టేది నేరుపుగాదు
మరుతంత్రములవారు మంతనాన నుండవలె
విరసాన రచ్చలుంటే వేడుక గాదు
(॥ఱట్టు॥)
వొడఁబాటు గలవారు వొద్దికతో నుండవలె
అడియాసలఁ బొరలే దందము గాదు
అడరి శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
తడయక కూడితివి తగులాయ మోహము
(||pallavi||)
ṟaṭṭu seyaga rāvĕ yiṭṭĕ nīvu
gaṭṭigā vachchevaṁṭām̐ gāsugunnavām̐ḍu
(||ṟaṭṭu||)
sĕlimi sesinavāru sedigilonu gāvalĕ
salamulu sādiṁcha saṁgadigādu
valasina vāralu vaddam̐ bāyaguṁḍavalĕ
pŏlayalugalu sūbam̐ bŏsam̐ga dĕppuḍunu
(||ṟaṭṭu||)
sarasa māḍeḍivāru sammadiṁchi vuṁḍavalĕ
nĕrasulu paṭṭedi nerubugādu
marudaṁtramulavāru maṁtanāna nuṁḍavalĕ
virasāna rachchaluṁṭe veḍuga gādu
(||ṟaṭṭu||)
vŏḍam̐bāḍu galavāru vŏddigado nuṁḍavalĕ
aḍiyāsalam̐ bŏrale daṁdamu gādu
aḍari śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
taḍayaga kūḍidivi tagulāya mohamu