Ṟattu sesemgaaga mammu ṟaadigumdedo

ఱట్టు సేసెఁగాక మమ్ము ఱాతిగుండెతో
Language

(॥పల్లవి॥)
ఱట్టు సేసెఁగాక మమ్ము ఱాతిగుండెతో
గట్టిగ వాకిట వచ్చి కాచుకుండనా

(॥ఱట్టు॥)
తనతో మాటాడనంటా తప్పులు వట్టేవాఁడు
యెనసి యీ పొద్దాయ యేడ నుండెనే
అనకుండరాదా మాట ఆయాలు సోఁకేవేళ
పెనఁగి ఇందాఁకా నేను పిలిపించనా

(॥ఱట్టు॥)
యెదురుగా రానంటా యెగ్గులు వట్టేవాడు
వుదుటు సేఁతలకేల వొడిగట్టెనే
వొదిగి వుండఁగరాదు వొరసి తా మించఁగాను
అదనఁ జెలుల నంపి ఆనలు వెట్టించనా

(॥ఱట్టు॥)
నేనే ముందు గూడనంటా నెరుసు లెంచేవాఁడు
పానిపట్టి తానేల పంతాలాడీనే
కానిమ్మంటాఁ బుట్టపర్తికాఁడ శ్రీ వేంకటేశ్వరు
యీనెపానఁ గూడితి నే నెచ్చరించనా

(||pallavi||)
ṟaṭṭu sesĕm̐gāga mammu ṟādiguṁḍĕdo
gaṭṭiga vāgiḍa vachchi kāsuguṁḍanā

(||ṟaṭṭu||)
tanado māḍāḍanaṁṭā tappulu vaṭṭevām̐ḍu
yĕnasi yī pŏddāya yeḍa nuṁḍĕne
anaguṁḍarādā māḍa āyālu som̐keveḽa
pĕnam̐gi iṁdām̐kā nenu pilibiṁchanā

(||ṟaṭṭu||)
yĕdurugā rānaṁṭā yĕggulu vaṭṭevāḍu
vuduḍu sem̐talagela vŏḍigaṭṭĕne
vŏdigi vuṁḍam̐garādu vŏrasi tā miṁcham̐gānu
adanam̐ jĕlula naṁpi ānalu vĕṭṭiṁchanā

(||ṟaṭṭu||)
nene muṁdu gūḍanaṁṭā nĕrusu lĕṁchevām̐ḍu
pānibaṭṭi tānela paṁtālāḍīne
kānimmaṁṭām̐ buṭṭabardigām̐ḍa śhrī veṁkaḍeśhvaru
yīnĕbānam̐ gūḍidi ne nĕchchariṁchanā