రసికుఁడ వౌదు పండరంగినాథా నీ
(॥పల్లవి॥)
రసికుఁడ వౌదు పండరంగినాథా నీ-
పసలఁ జిక్కితి మిదె పండరంగినాథా
(॥రసికుడ॥)
యివ్వల నవ్వల నేఁడు యిటు నీతో నవ్వి నవ్వి
రవ్వైతిమి గదో పండరంగినాథా
కువ్వ లాయ నీ చేఁతలు గురి యయితి మింతకు
పవ్వళించితిరి మేలు పండరంగినాథా
(॥రసికుడ॥)
రుచు లైన నీ మాఁటలె రూఢి కెక్కెంచెను మమ్ము
రచనకాఁడ వో పండరంగినాథా
యిచట నీ రాకలను నెదురు చూపించి మేలె
పచరించితివి బాపు పండరంగినాథా
(॥రసికుడ॥)
సారెఁ దీసితివి కొప్పు చన్ను లంటి చూచితివి
రారాదా యిఁక పండరంగినాథా
కూరిమి శ్రీవెంకటాద్రిఁ గూడి చొక్కించితి మమ్ము
పైరు లాయఁ బులకలు పండరంగినాథా
(||pallavi||)
rasigum̐ḍa vaudu paṁḍaraṁgināthā nī-
pasalam̐ jikkidi midĕ paṁḍaraṁgināthā
(||rasiguḍa||)
yivvala navvala nem̐ḍu yiḍu nīdo navvi navvi
ravvaidimi gado paṁḍaraṁgināthā
kuvva lāya nī sem̐talu guri yayidi miṁtagu
pavvaḽiṁchidiri melu paṁḍaraṁgināthā
(||rasiguḍa||)
rusu laina nī mām̐ṭalĕ rūḍhi kĕkkĕṁchĕnu mammu
rasanagām̐ḍa vo paṁḍaraṁgināthā
yisaḍa nī rāgalanu nĕduru sūbiṁchi melĕ
pasariṁchidivi bābu paṁḍaraṁgināthā
(||rasiguḍa||)
sārĕm̐ dīsidivi kŏppu sannu laṁṭi sūsidivi
rārādā yim̐ka paṁḍaraṁgināthā
kūrimi śhrīvĕṁkaḍādrim̐ gūḍi sŏkkiṁchidi mammu
pairu lāyam̐ bulagalu paṁḍaraṁgināthā