Ramtigi nokkadi yaaya raampula yee bhaavaalu

రంటికి నొక్కటి యాయ రాఁపుల యీ భావాలు
Language

(॥పల్లవి॥)
రంటికి నొక్కటి యాయ రాఁపుల యీ భావాలు
పెంటలై యిదె నన్ను పెర రేఁచీ నేలే

(॥రంటికి॥)
అతనికౌఁగిటిలోన నందేటి పెంజెమటలు
పతిఁ బాసివుండఁగాను పైకొనీ నేలే
రతివేళ నలయించి రాఁగేటి నిట్టూర్పులు
అతివిరహపువేళ నవి నిండీ నేలే

(॥రంటికి॥)
జంటయై విభునిఁ బొంది జారేటి నా తురు మిది
వొంటినే చెదరె నెరు లూరకే యేలే
అంటి ముట్టి పరవశమంటేటి నివ్వెఱగులు
యింటిలోఁ జింతించే నన్ను నింత ముంచ నేలే

(॥రంటికి॥)
నగుతా సరసవేళ నవ్వేటి మోవినవ్వుల
తగఁ జింతించేవేళ తా రా నేలే
అగపడి శ్రీవేంకటాదిపుఁ డప్పుడే కూడె
చిగురు దేనెమోవికి చేఁగదేర నేలే

(||pallavi||)
raṁṭigi nŏkkaḍi yāya rām̐pula yī bhāvālu
pĕṁṭalai yidĕ nannu pĕra rem̐sī nele

(||raṁṭigi||)
adanigaum̐giḍilona naṁdeḍi pĕṁjĕmaḍalu
padim̐ bāsivuṁḍam̐gānu paigŏnī nele
radiveḽa nalayiṁchi rām̐geḍi niṭṭūrbulu
adivirahabuveḽa navi niṁḍī nele

(||raṁṭigi||)
jaṁṭayai vibhunim̐ bŏṁdi jāreḍi nā turu midi
vŏṁṭine sĕdarĕ nĕru lūrage yele
aṁṭi muṭṭi paravaśhamaṁṭeḍi nivvĕṟagulu
yiṁṭilom̐ jiṁtiṁche nannu niṁta muṁcha nele

(||raṁṭigi||)
nagudā sarasaveḽa navveḍi movinavvula
tagam̐ jiṁtiṁcheveḽa tā rā nele
agabaḍi śhrīveṁkaḍādibum̐ ḍappuḍe kūḍĕ
siguru denĕmovigi sem̐gadera nele