రంటికి(?) నొక్కటే మాట రమణుఁడ నీతోను
(॥పల్లవి॥)
రంటికి(?) నొక్కటే మాట రమణుఁడ నీతోను
నంటున నీ చిత్త మెట్టో నాకింకఁ దెలియదు
(॥॥)
నీవే మంచివాఁడ వైతే నెరి నెం దుండిన నేమి
భావించి నిన్నుఁ బొగడఁ బనిలేదు
యే వంక నీవే నాకు నెరవులవాఁడ వైతే
ఆవటించి నిన్ను దూర నంత పని లేదూ
(॥॥)
మనసు లేక మైతే మారు మాట లాడవద్దు
చనవుల విన్నపాలు చవి గావు
యెనయక జగడించి యిద్దర మిట్టే వుండిన
మనలోనే విన్నపాలు మరి చవిగావూ
(॥॥)
గక్కనఁ గూడితి మిట్టే కైవసమైతివి నాకు
యెక్కువ తక్కువ పంతా లిఁక నేలా
చక్కని శ్రీ వేంకటేశ చలానకే నీ వుండితే
మక్కువలు పయిఁ జల్ల మరి యిఁక నేలా.
(||pallavi||)
raṁṭigi(?) nŏkkaḍe māḍa ramaṇum̐ḍa nīdonu
naṁṭuna nī sitta mĕṭṭo nāgiṁkam̐ dĕliyadu
(||||)
nīve maṁchivām̐ḍa vaide nĕri nĕṁ duṁḍina nemi
bhāviṁchi ninnum̐ bŏgaḍam̐ baniledu
ye vaṁka nīve nāgu nĕravulavām̐ḍa vaide
āvaḍiṁchi ninnu dūra naṁta pani ledū
(||||)
manasu lega maide māru māḍa lāḍavaddu
sanavula vinnabālu savi gāvu
yĕnayaga jagaḍiṁchi yiddara miṭṭe vuṁḍina
manalone vinnabālu mari savigāvū
(||||)
gakkanam̐ gūḍidi miṭṭe kaivasamaidivi nāgu
yĕkkuva takkuva paṁtā lim̐ka nelā
sakkani śhrī veṁkaḍeśha salānage nī vuṁḍide
makkuvalu payim̐ jalla mari yim̐ka nelā.