Rammani piluvamgade ramanunini

రమ్మని పిలువఁగదె రమణునిని
Language

(॥పల్లవి॥)
రమ్మని పిలువఁగదె రమణునిని
కుమ్మరింపు వలపులు గూఁటఁ బెట్టేవా

(॥రమ్మని॥)
పొంతనే యాతఁడు నిన్ను పొదిగి లాలించఁగాను
పంతములాడుకొనేవు పైపై నీవు
యింత గలదానవు యిందరుఁ జూడఁగ నీవు
కంతుని యమ్ములమీఁద గాత చూపేవా

(॥రమ్మని॥)
కాయమంటి నిన్నాతఁడు కలయఁగ రాఁగాను
చేయివట్టి దొబ్బేవు చెలఁగి నీవు
నీయంత రాజవైతే నిండుకొన్న మతిలోని
పాయపు మదములనుఁ బాయఁ దోలేవా

(॥రమ్మని॥)
శ్రీవేంకటేశుఁడు నీకుఁ జెంది మోవియ్యఁగ నందు
కావిగురుతులు నించి కాఁతాళించేవు
దేవులవైతే నీవు ద్రిష్టముగఁ గూడిన
కోవరపు రతులతో గుప్పించేవా

(||pallavi||)
rammani piluvam̐gadĕ ramaṇunini
kummariṁpu valabulu gūm̐ṭam̐ bĕṭṭevā

(||rammani||)
pŏṁtane yādam̐ḍu ninnu pŏdigi lāliṁcham̐gānu
paṁtamulāḍugŏnevu paibai nīvu
yiṁta galadānavu yiṁdarum̐ jūḍam̐ga nīvu
kaṁtuni yammulamīm̐da gāda sūbevā

(||rammani||)
kāyamaṁṭi ninnādam̐ḍu kalayam̐ga rām̐gānu
seyivaṭṭi dŏbbevu sĕlam̐gi nīvu
nīyaṁta rājavaide niṁḍugŏnna madiloni
pāyabu madamulanum̐ bāyam̐ dolevā

(||rammani||)
śhrīveṁkaḍeśhum̐ḍu nīgum̐ jĕṁdi moviyyam̐ga naṁdu
kāvigurudulu niṁchi kām̐tāḽiṁchevu
devulavaide nīvu driṣhṭamugam̐ gūḍina
kovarabu radulado guppiṁchevā