రమ్మనవు పొమ్మనవు రాజసము నెరపేవు
(॥పల్లవి॥)
రమ్మనవు పొమ్మనవు రాజసము నెరపేవు
తెమ్మలుగా నవ్వునవ్వి తెలుసుకొవే
(॥రమ్మ॥)
చెప్పుడుమాటలు విని, చెలువుఁడు నీకిచ్చినఁ
కప్పురమేఁటికి నీకుఁ గాదనేవే
దప్పి దేరేమోవితోడ తలవంచుకొని యాతఁ
డప్పట నుంటియు నున్నాఁడది గదవే
(॥రమ్మ॥)
ఇంగితాకారాలు చూచి యీతఁడు వెట్టినతమ్మ
యెంగిలి యనుచు సారెనేల మొక్కేవే
వుంగరము చేతికిచ్చి వూరకే యానలు వెట్టీ
అంగవించి నిన్నుఁ బాయఁ డదిగదివే
(॥రమ్మ॥)
వింతవాసనలతో నీవిభుఁడు కొంగువట్టఁగ
ఇంతలోఁ దప్పించుకొంటానేల లోఁగేవే
అంతటి శ్రీ వేంకటేశుఁ డాతఁడే నిన్నిటు గూడె
అంతరంగమెల్లాఁ జెప్పె నదిగదవే
(||pallavi||)
rammanavu pŏmmanavu rājasamu nĕrabevu
tĕmmalugā navvunavvi tĕlusugŏve
(||ramma||)
sĕppuḍumāḍalu vini, sĕluvum̐ḍu nīgichchinam̐
kappuramem̐ṭigi nīgum̐ gādaneve
dappi deremovidoḍa talavaṁchugŏni yādam̐
ḍappaḍa nuṁṭiyu nunnām̐ḍadi gadave
(||ramma||)
iṁgidāgārālu sūsi yīdam̐ḍu vĕṭṭinadamma
yĕṁgili yanusu sārĕnela mŏkkeve
vuṁgaramu sedigichchi vūrage yānalu vĕṭṭī
aṁgaviṁchi ninnum̐ bāyam̐ ḍadigadive
(||ramma||)
viṁtavāsanalado nīvibhum̐ḍu kŏṁguvaṭṭam̐ga
iṁtalom̐ dappiṁchugŏṁṭānela lom̐geve
aṁtaḍi śhrī veṁkaḍeśhum̐ ḍādam̐ḍe ninniḍu gūḍĕ
aṁtaraṁgamĕllām̐ jĕppĕ nadigadave