(॥పల్లవి॥)
రమ్మనవే యిఁకనేల రవ్వసేయక
పమ్ముకొన్న తమకము పారిపోవనిచ్చునా
(॥రమ్మ॥)
తనియని నా మనసు తనుఁ గోరకుండునా
చెనకి నా ప్రియములు చేకొనుఁగాక
మునుకొన్న చూపులు మోము చూడకుండునా
యెనసి నా చేఁతలకు నియ్యకొనుఁగాక
(॥రమ్మ॥)
కోమలపు నా వయసు కొంగు వట్టించకుండునా
దీమసానఁ గూడ సమ్మతించుఁగాక
దోమటి నా వలపులు తొలఁగఁగ నిచ్చునా
నా మాటలు దోయక నన్ను నేలుఁగాక
(॥రమ్మ॥)
కందువ నావలపులు కలయఁబెట్టకుండునా
ఇందరిలో నాకుఁ జనవిచ్చుఁగాక
పొందులు శ్రీవేంకటేశుఁ బొనుఁగఁగ నిచ్చునా
చెందె నన్ను నిఁక నిట్టె చెలఁగించుఁగాక
(||pallavi||)
rammanave yim̐kanela ravvaseyaga
pammugŏnna tamagamu pāribovanichchunā
(||ramma||)
taniyani nā manasu tanum̐ goraguṁḍunā
sĕnagi nā priyamulu segŏnum̐gāga
munugŏnna sūbulu momu sūḍaguṁḍunā
yĕnasi nā sem̐talagu niyyagŏnum̐gāga
(||ramma||)
komalabu nā vayasu kŏṁgu vaṭṭiṁchaguṁḍunā
dīmasānam̐ gūḍa sammadiṁchum̐gāga
domaḍi nā valabulu tŏlam̐gam̐ga nichchunā
nā māḍalu doyaga nannu nelum̐gāga
(||ramma||)
kaṁduva nāvalabulu kalayam̐bĕṭṭaguṁḍunā
iṁdarilo nāgum̐ janavichchum̐gāga
pŏṁdulu śhrīveṁkaḍeśhum̐ bŏnum̐gam̐ga nichchunā
sĕṁdĕ nannu nim̐ka niṭṭĕ sĕlam̐giṁchum̐gāga