Rammanave yimkanela radigekkam daanitte

రమ్మనవే యింకనేల రతికెక్కఁ దానిట్టే
Language

(॥పల్లవి॥)
రమ్మనవే యింకనేల రతికెక్కఁ దానిట్టే
దొమ్మిచేసి నేనిందుకు దూరవచ్చేనా

(॥రమ్మన॥)
పంతమాడి నిజములు పచరించ వచ్చీని
యెంత లేదు తనసుద్దు లెఱుఁగమటే
వింతదాననా నేను విభుఁడు తా నెట్టుండినా
రంతుచేసి నేనిప్పుడే రచ్చఁ బెట్టేనా

(॥రమ్మన॥)
పలుమారు వూరకైనా బాసలు సేయ వచ్చీని
చలపట్టి తనునింక సాదించేనా
వెలయాలనా యేమి విటుఁడు దానెట్టుండినా
బలిమిచేసి భంగపఱచ వచ్చేనా

(॥రమ్మన॥)
వోడక కాఁగిటఁ గూడి వొడఁబరచ వచ్చీని
యేడ నుంటివని తప్పులెంచ వచ్చేనా
వేడుక కత్తెనా శ్రీవేంకటేశుఁ డెట్టుండినా
వీడెమందుకొంటి నింక విరసమాడేనా

(||pallavi||)
rammanave yiṁkanela radigĕkkam̐ dāniṭṭe
dŏmmisesi neniṁdugu dūravachchenā

(||rammana||)
paṁtamāḍi nijamulu pasariṁcha vachchīni
yĕṁta ledu tanasuddu lĕṟum̐gamaḍe
viṁtadānanā nenu vibhum̐ḍu tā nĕṭṭuṁḍinā
raṁtusesi nenippuḍe rachcham̐ bĕṭṭenā

(||rammana||)
palumāru vūragainā bāsalu seya vachchīni
salabaṭṭi tanuniṁka sādiṁchenā
vĕlayālanā yemi viḍum̐ḍu dānĕṭṭuṁḍinā
balimisesi bhaṁgabaṟasa vachchenā

(||rammana||)
voḍaga kām̐giḍam̐ gūḍi vŏḍam̐barasa vachchīni
yeḍa nuṁṭivani tappulĕṁcha vachchenā
veḍuga kattĕnā śhrīveṁkaḍeśhum̐ ḍĕṭṭuṁḍinā
vīḍĕmaṁdugŏṁṭi niṁka virasamāḍenā