Rammanave yimka nelaraa raampulu

రమ్మనవే యిఁక నేలరా రాఁపులు
Language

(॥పల్లవి॥)
రమ్మనవే యిఁక నేలరా రాఁపులు
నమ్మి యిచ్చకమాడేదే నాకు మంచి దనవే

(॥॥)
చెల్లుబడి గల తాను సేసినదే చేఁత గాక
మల్లాడి కొసరఁగ మరి యేఁటికే
బల్లిదుఁ డు తనతోనేఁ బట్టి పెనఁగే నంటే
యెల్ల చందాలా నేఁడు యీడువచ్చె నలవే

(॥॥)
విచ్చన విడైన వాని వేడుక లీడేరుఁగాక
మచ్చరాన నౌఁగా దని మాన్ప నేఁటికే
తచ్చన కాఁడు తన్నుఁ దగవులఁ బెట్టే నంటే
యిచ్చటఁ దన ముందర నెంతదాననే

(॥॥)
కడు జాణయిన వాని గతులు మంచివి గాక
కొడిమె లెంచి మారుకొన నేఁ టికే
యెడయక శ్రీ వేంకటేశుఁ డిట్టే నన్నుఁగూడె
బడి బడి నుందుఁ గాక పాయఁ గల నటవే

(||pallavi||)
rammanave yim̐ka nelarā rām̐pulu
nammi yichchagamāḍede nāgu maṁchi danave

(||||)
sĕllubaḍi gala tānu sesinade sem̐ta gāga
mallāḍi kŏsaram̐ga mari yem̐ṭige
ballidum̐ ḍu tanadonem̐ baṭṭi pĕnam̐ge naṁṭe
yĕlla saṁdālā nem̐ḍu yīḍuvachchĕ nalave

(||||)
vichchana viḍaina vāni veḍuga līḍerum̐gāga
machcharāna naum̐gā dani mānpa nem̐ṭige
tachchana kām̐ḍu tannum̐ dagavulam̐ bĕṭṭe naṁṭe
yichchaḍam̐ dana muṁdara nĕṁtadānane

(||||)
kaḍu jāṇayina vāni gadulu maṁchivi gāga
kŏḍimĕ lĕṁchi mārugŏna nem̐ ṭige
yĕḍayaga śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐gūḍĕ
baḍi baḍi nuṁdum̐ gāga pāyam̐ gala naḍave