రమ్మనవే వొ చెలియా రమణుని మా యింటికి
(॥పల్లవి॥)
రమ్మనవే వొ చెలియా రమణుని మా యింటికి
కమ్మర నడుగనేల కాదనేనా నేను
(॥రమ్మ॥)
కనుసన్నలనే వట్టికాఁక రేఁచవద్దుగాక
మనసారా మాటాడితే మంచిదే కదే
పెనఁగుచు నూరకే బిగియఁగవద్దుగాక
చనవిచ్చి మన్నించుటే సమ్మతౌనే కదవే
(॥రమ్మ॥)
నాలిసేసి నాఁటకము నడపఁగవద్దుగాక
మేలము నాతో నాడితే మేలె కదే
వోలవేసి వలపించి వోరసేయవద్దుగాక
వేళతో వచ్చి కూడితే వేడుకే కదే
(॥రమ్మ॥)
గుట్టుతోడ నెలయించి గోర సేయవద్దుగాక
యిట్టే వొద్దికై వుండితే నితవే కదే
చిట్టకము వద్దుగాక శ్రీవేంకటేశుఁడు నన్ను
నెట్టనఁ బెండ్లాడినాఁడు నేరుపిదౌఁగదవే
(||pallavi||)
rammanave vŏ sĕliyā ramaṇuni mā yiṁṭigi
kammara naḍuganela kādanenā nenu
(||ramma||)
kanusannalane vaṭṭigām̐ka rem̐savaddugāga
manasārā māḍāḍide maṁchide kade
pĕnam̐gusu nūrage bigiyam̐gavaddugāga
sanavichchi manniṁchuḍe sammadaune kadave
(||ramma||)
nālisesi nām̐ṭagamu naḍabam̐gavaddugāga
melamu nādo nāḍide melĕ kade
volavesi valabiṁchi voraseyavaddugāga
veḽado vachchi kūḍide veḍuge kade
(||ramma||)
guṭṭudoḍa nĕlayiṁchi gora seyavaddugāga
yiṭṭe vŏddigai vuṁḍide nidave kade
siṭṭagamu vaddugāga śhrīveṁkaḍeśhum̐ḍu nannu
nĕṭṭanam̐ bĕṁḍlāḍinām̐ḍu nerubidaum̐gadave