Rammanave vaddanenaa radivelagu vibhuni

రమ్మనవే వద్దనేనా రతివేళకు విభుని
Language

(॥పల్లవి॥)
రమ్మనవే వద్దనేనా రతివేళకు విభుని
కుమ్మరించితే నాసలు కుప్పవడీనా

(॥॥)
పూవు వంటిదాన నేను పుప్పొడి వంటి వలపు
తావి గొంటా నుండుఁ గాక తన కేమే
చేవ వంటిదీ వావి చిగురువంటిదీ తమి
వేవేలై పెరుగుఁ గాక విసుగునేలే

(॥॥)
పండు వంటిదీ మోవి పలుకు తేనెవంటిదీ
వుండుఁ గాక చవిగొంటా నుపమ లేలే
కొండ వంటిదీ వేడుక కోరికె మొయిలు వంటిదీ
నిండు కొని కప్పుఁ గాక నేరము లేలే

(॥॥)
గని వంటిదీ కౌఁగిలి కళ వంటిదీ వయసు
యెనయుచు నుండుఁ గాక యెరవు లేలే
నను శ్రీ వేంకటేశుఁడు నాఁడే పెండ్లాడెఁ దాను
నని చెలమేల్మంగను నవ్వ నింత యేలే

(||pallavi||)
rammanave vaddanenā radiveḽagu vibhuni
kummariṁchide nāsalu kuppavaḍīnā

(||||)
pūvu vaṁṭidāna nenu puppŏḍi vaṁṭi valabu
tāvi gŏṁṭā nuṁḍum̐ gāga tana keme
seva vaṁṭidī vāvi siguruvaṁṭidī tami
vevelai pĕrugum̐ gāga visugunele

(||||)
paṁḍu vaṁṭidī movi palugu tenĕvaṁṭidī
vuṁḍum̐ gāga savigŏṁṭā nubama lele
kŏṁḍa vaṁṭidī veḍuga korigĕ mŏyilu vaṁṭidī
niṁḍu kŏni kappum̐ gāga neramu lele

(||||)
gani vaṁṭidī kaum̐gili kaḽa vaṁṭidī vayasu
yĕnayusu nuṁḍum̐ gāga yĕravu lele
nanu śhrī veṁkaḍeśhum̐ḍu nām̐ḍe pĕṁḍlāḍĕm̐ dānu
nani sĕlamelmaṁganu navva niṁta yele